Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

LIC: సాయుధ బలగాలకు ఎల్‌ఐసీ బంపర్‌ ఆఫర్‌

LIC: మనకి తెలిసిన బీమా సంస్థల్లో అత్యధిక ప్రాచుర్యం పొందిన సంస్థ లైఫ్‌ ఇన్సురెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎల్‌ఐసీ) (LIC). ఇది అత్యంత ప్రజాదరణ పొందిన సంస్థ కూడా ఇదే అనే చెప్పాలి. అంతే కాకుండా ప్రజలు కూడా పాలసీ తీసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు. అలాగే ప్రభుత్వ మద్దతు కూడా ఉండటం మేలు చేస్తుందని పాలసీదారులు అంచనా. అందుకే ఎల్‌ఐసీ పాలసీలకు మార్కెట్లో అధిక డిమాండ్‌ ఉంది. అందుకు తగ్గటు ఎల్‌ఐసీ కూడా అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన పాలసీలను ప్రజల కోసం ప్రవేశ పెడుతుంది. ఇందులో పిల్లల నుంచి పెద్దల వరకూ అన్ని వయసుల వారికీ పాలసీలుంటాయి. ఇదే క్రమంలో ఇప్పుడు దేశాన్ని కాపాడే రక్షణ రంగ సిబ్బందికి అంటే సైనికులకు ఓ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ నుంచి భారత భద్రతా దళాల్లో పనిచేసే సిబ్బంది కోసం ప్రత్యేక గృహ రుణ పథకాన్ని (Home loan scheme)మొదలు పెట్టింది. ఈ పథకం పేరు గృహ రక్షక్‌. ఈ పథకం నికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసు కుంద్దాం

ఎల్‌ఐసీ భారత సైన్యంలో పనిచేసే సిబ్బందికి గుడ్‌ న్యూస్‌ తెలిపింది. ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ద్వారా గృహ రుణ సదుపాయాన్ని కూడా ఇస్తుంది. గృహ రక్షక్‌ (Griha Rakshak)పేరుతో తీసుకొచ్చిన ఈ పథకంలో అర్హత కలిగిన వారికి కేవలం 8.4శాతం వడ్డీ రేటతో రూ. 2కోట్ల వరకూ గృహ రుణాలను అందించనున్నట్లు తెలిపింది ఎల్‌ఐసీ. అలాగే సైన్యంలో పనిచేస్తూ.. క్రెడిట్‌ స్కోర్‌ 750 అంతకన్నా ఎక్కువ ఉన్న వారు ఈ పథకానికి అర్హులను పేర్కొంది. వార్షిక వడ్డీ కేవలం 8.4శాతంగానే ఉంటుందని ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ వివరాలను తెలిపింది.

ఇక గృహ రక్షక్‌తో కేవలం తక్కువ వడ్డీ (intrest) మాత్రమే కాక ఇతర ప్రయోజనాలను కూడా ఇస్తుంది. అవి ఏమిటంటే .. లోన్‌ తీసుకునే వారికి పరిమిత కాల ఆఫర్‌ కింద ప్రాసెసింగ్‌ ఫీజులను సైతం మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. భద్రతా బలగాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న వారే కాకుండా రిటైర్డ్‌ (retairtment)అయిన అధికారులు, సిబ్బంది సైతం ఈ ఆఫర్‌ వర్తిస్తుంది అని ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ వెల్లడించింది.

కానీ పథకం మాత్రం పరిమిత కాలం వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుందని ఎల్‌ఐసీ తెలిపింది. ఒక నెలా 14రోజుల వరకూ అంటే సెప్టెంబర్ 30, 2024 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని సైనికులు దరఖాస్తు చేసుకోవాలని ఎల్‌ఐసీ కోరడం జరిగింది

.