Liquor Price: కొంత మందికి మద్యం లేనిదే ముద్దా కూడా తినరు. అయితే తాజాగా మద్యం ప్రియులకు శుభవార్త .. ఈ నెల నుంచి విదేశీ మద్యం ధరలు భారీగా తగ్గనున్నాయి. ఈ నెల నుంచి కొత్త టారిఫ్ రేట్స్ (Tariff rates)అమల్లోకి రాబోతున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి కొత్త మద్యం ధరలు అమల్లోకి వస్తాయని ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ తెలియచేసింది. అయితే ఇది మన ఏపీలో, తెలంగాణలోనూ అనుకుంటూ పొరపాటే ఇది కేవలం అసోం రాష్ట్రంలో.
ఇక అక్కడ ఎక్సైజ్ శాఖ విదేశీ మద్యం ధరను తగ్గించింది. 5 శాతం ఆల్కహాల్ కలిగిన 650 ఎంఎల్ బీరు ధరపై రూ.22 తగ్గింది. 5 శాతం కంటే ఎక్కువ ఆల్కహాల్(Alcohol) ఉన్న 650 ఎంఎల్ బీర్ ధర రూ.34 తగ్గింది. నార్మల్ బ్రాండ్ 750 ఎంఎల్ రమ్‌పై రూ.117 తగ్గింది. 750 ఎంఎల్ రెగ్యులర్ బ్రాండ్ విస్కీ, జింక్ ధర రూ.144 తగ్గింది.ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి విదేశీ మద్యం ధరలను పెంచారు. అయితే ధరల పెంపు తర్వాత మద్యం ఆదాయం తగ్గడంతో మళ్లీ మద్యం ధర తగ్గు మొఖం పట్టింది.
ఇది ఇలా ఉండగా మద్యం ధరలు తగ్గనుండగా, నేటి నుంచి పాల ధరలు పెరగనున్నాయి. గువాహటి డెయిరీ ట్రేడర్స్ అసోసియేషన్ (జిడిఎ) విలేకరుల సమావేశంలో పాల ధరలను పెంచుతున్నట్లు తెలిపారు. గ్రేటర్ గౌహతి పశువుల (Cattle of Greater Guwahati)పెంపకందారుల సంఘం పాల ధరను పెంచడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఆగస్టు 17 నుంచి పాలపై లీటరుకు రూ.2.60 పెంచినట్లు పాల వ్యాపారుల సంఘం తెలిపారు. పాల ధర లీటరుకు రూ.3 పెంచినట్లు గ్రేటర్ గౌహతి డెయిరీ ట్రేడర్స్ అసోసియేషన్ తెలియచేసారు. ఇలా ధరల పెంపుతో సామాన్య ప్రజలు లీటరు పాలను రూ.67కి కొనుగోలు చేయాల్సి వస్తోంది. కంపెనీ ప్రస్తుతం పాలను హోల్‌సేల్ ధరకు రూ.3 పెంచింది. అందువల్ల రిటైల్ విక్రయాలు (Retail sales) సెప్టెంబర్ నుంచి పాల రిటైల్ ధర రూ.67 గా ఉండబోతుంది.