loan: మన భారత దేశంలో వివిధ రుణాలపై వడ్డీ రేట్లు (Interest rates)బాగా పెరగనున్నాయి. ఈ మేరకు బ్యాంకులు తమ రేట్లను సవరించాయి. ఇప్పటికే దేశంలోని ప్రముఖ బ్యాంకులు అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా, యూకో బ్యాక్, కెనరా బ్యాంక్ (Bank of Baroda, UCO Back, Canara Bank) వంటివి తమ బ్యాంకుల్లో మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లు(ఎంసీఎల్ఆర్)ను పెంచుతున్నట్లు ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ సవరించిన రేట్లు ఆగస్టు 12 నుంచి అమలులోకి వచ్చాయి. ఇప్పటికే ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)తో పాటు పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా (Punjab National Bank, Bank of India) వంటి సంస్థలు ఎంసీఎల్ఆర్ ను భారీగా పెంచాయి. ఈ క్రమంలో రుణ గ్రహీతలపై భారం ఎలా ఉంటుంది? ఏ బ్యాంకు ఎంత మేర ఎంసీఎల్ఆర్‌ను పెంచింది? మనం ఇప్పడూ చూద్దాం…
ఇటీవల జరిగిన సమావేశంలో ఆర్‌బీఐ (RBI) మానిటరీ పాలసీ నేపథ్యంలో రెపో రేటును 6.50 శాతం వద్ద కొనసాగించింది. దానిలో ఎటువంటి మార్పు అయితే చేయలేదు. దీంతో గత శుక్రవారం బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) , కెనరా బ్యాంక్, యూకో బ్యాంక్లు ఎంసీఎల్ఆర్ ను పెంచుతున్నట్లు ప్రకటన విడుదల చేసాయి. ఇప్పటికే రుణాలు కలిగి ఉన్న వారిపై ఈ చర్య కారణంగా ఈఎంఐ భారం బాగా పెరగనుంది. అయితే ఫిక్స్ డ్ వడ్డీ ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంటరెస్ట్ పై లోన్ తీసుకున్న వారిపై ఈ భారం భారీగా పడనుంది.
గత నెలలోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (sbi)ఎంసీఎల్ఆర్ రేటును 5-10 బేసిస్ పాయింట్లు (Basis points) కూడా పెంచింది. దీనిలో ప్రస్తుతం ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 8.75 శాతం, ఏడాదికి 8.85 శాతం వద్ద ఉన్నాయి. ఈ నెల ప్రారంభంలో, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా తన ఎంసీఎల్ఆర్ 5 బేసిస్ పాయింట్లు పెంచింది. ప్రస్తుతం ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 8.75 శాతం, ఏడాదికి 8.90 శాతంగా ఉంది. అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఒక సంవత్సరం ఎంసీఎల్ఆర్ ని ఆగస్టు 1 నుంచి 5 బేసిస్ పాయింట్లు పెంచి 8.95 శాతానికి పెంచింది. ఇండియన్ బ్యాంక్ తన ఓవర్‌నైట్ తో పాటు ఒక నెల ఎంసీఎల్ఆర్ ని ఒక్కొక్కటి 5 బేసిస్ పాయింట్లు పెంచి వరుసగా 8.20 శాతం, 8.45 శాతానికి పెంచింది. ఇవి అన్ని కూడా ఆగస్ట్ 3 నుంచి అమలులోకి వచ్చిన సంగతి అందరికి తెలిసిందే..