ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రామ్ యూజర్లకు మెటా షాకివ్వనుoదా
— పెయిడ్ సర్వీసులపై యాజమాన్యం నిర్ణయం
ప్రజా దీవెన/ న్యూఢిల్లీ: ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రామ్ యూజర్లకు గట్టి షాక్ తగలనుందా అంటే నిజమనే సంకేతాలు వెలువడుతున్నాయి.
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా యాజమాన్యమే ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రామ్ యూజర్లకు షాకిచేందుకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం.
ఆ రెండు వేదికలపై యాడ్స్‌ప్లే అవ్వకూడదనుకుంటే అందుకు యూజర్లు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని ఈ విశ్వసనీయ వర్గాల సమాచారం సారాంశం. ప్రస్తుతం ఈ నిబంధన యురేపియన్ యూనియన్‌లో అందుబాటులోకి రానుందని, త్వరలో మిగిలిన దేశాలకు సైతం వర్తించనుందని తెలుస్తోంది.
సదరు ప్రచారంపై మెటా అధినేత మార్క్ జుకర్ బెర్గ్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంటుంది. 2019 నుంచి మెటా సేవలపై యూరోపియన్ యూనియన్ దేశాల ఆగ్రహం వ్యక్తం చేస్తూనే మెటా అనుమతి లేకుండా వినియోగదారుల డేటాను సేకరిస్తుందని ఆరోపిస్తున్నాయి.
ఈ తరుణంలో మెటా యాజమాన్యం పెయిడ్ సర్వీసులపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ సేవలు అందుబాటులోకి వస్తే యూజర్లు పేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌కు ఏ ఒక్కదానికి చెల్లించినా మరొకటి ఉచితంగా ఇవ్వనున్నది.
ఇక పెయిడ్ వెర్షన్‌లో యూజర్ల నుంచి ఎంత వసూలు చేస్తారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉండగా రెండు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు ఒకేసారి చెల్లించి వాడుకోవడంతో పాటు లేదంటే వేర్వేరుగా ప్లాన్ సైతం ఎంపిక చేసుకునే అవకాశం ఉన్నట్లు వినికిడి.