Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mutual fund: ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే కళ్ళు చెదిరే రిటర్న్స్..?

Mutual fund: ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ (Mutual fund) ఇండియాలో చాలా పాత మ్యూచువల్ ఫండ్ కంపెనీలలో ఒకటి. ఇది మన దేశంలో చాలా కాలంగా పెట్టుబడులను నిర్వహిస్తోంది. ఈ కంపెనీ దాదాపు 60 రకాల మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లను నిర్వహిస్తుంది. ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ వద్ద ప్రస్తుతం దాదాపు 9,90,090 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇది చాలా పెద్ద AUM అమౌంట్ అని చెప్పుకోవచ్చు. ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ 37 ఏళ్లుగా ఈ పని చేస్తోంది. అంటే, దీనికి పెట్టుబడుల గురించి చాలా అనుభవం ఉంది. ఈ కంపెనీ నిర్వహించే చాలా స్కీమ్‌లు చాలా బాగా పని చేశాయి. ఇక్కడ పెట్టుబడి పెడితే మన డబ్బు (money) మరింత పెరిగే అవకాశాలే ఎక్కువ. ఈ కంపెనీలో కొన్ని స్కీమ్‌లు (schemes) చాలా బాగా పని చేశాయి. ఒకవేళ, ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్స్ లో ప్రతి నెల 20,000 రూపాయలు పెట్టుబడి పెడితే 5 సంవత్సరాలలో ఎంత డబ్బు వస్తుందో చూద్దాం.

ఎస్‌బీఐ PSU మ్యూచువల్ ఫండ్

ఎస్‌బీఐ PSU మ్యూచువల్ ఫండ్ అనేది ప్రభుత్వ రంగ సంస్థల (PSU) మీద పెట్టుబడి పెట్టే ఒక రకమైన మ్యూచువల్ ఫండ్. ఈ ఫండ్ గత 5 సంవత్సరాలలో చాలా హై రిటర్న్స్ అందించింది. ఇందులో ప్రతి నెల 20,000 రూపాయలు పెట్టుబడి పెడితే 5 సంవత్సరాలలో 41.77% రిటర్న్స్ వచ్చాయి. ఈ ఫండ్‌ AUM ప్రస్తుతం రూ.4,603 కోట్లు. ఈ ఫండ్‌లోని (fund) ఒక్కొక్క యూనిట్ విలువ ప్రస్తుతం 36.59 రూపాయలు. ఏటా ఈ ఫండ్‌ను నిర్వహించడానికి 0.78% ఖర్చవుతుంది. ఇందులో మంత్లీ రూ.20,000 5 ఏళ్ల పాటు పెట్టుబడి పెడితే, రూ.32.90 లక్షలు వచ్చి ఉండేవి.

ఎస్‌బీఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్

ఇది ప్రధానంగా రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు (Roads, Railways, Airports)వంటి మౌలిక సదుపాయాల రంగంలో పనిచేసే కంపెనీల మీద పెట్టుబడి పెడుతుంది. ఈ మ్యూచువల్ ఫండ్ గత 5 సంవత్సరాలలో రూ.20 వేల మంత్లీ ఇన్వెస్ట్మెంట్‌పై 36.93% రాబడి అందించింది. ఈ ఫండ్‌ను నిర్వహించడానికి ఏటా 1.17% ఖర్చు అవుతుంది. ఈ ఫండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్&టి, భారతి ఎయిర్టెల్, ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ వంటి కంపెనీల షేర్లను (shares)ఎక్కువగా కొనుగోలు చేసింది. ఇందులో మంత్లీ రూ.20,000 గత 5 ఏళ్లలో పెట్టుబడి పెట్టి ఉంటే, రూ.29.44 లక్షల వచ్చి ఉండేవి.

అలానే ఎస్‌బీఐ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ (గ్రోత్), ఎస్‌బీఐ స్మాల్ క్యాప్, ఎస్‌బీఐ మాగ్నమ్ మిడ్ క్యాప్ డైరెక్ట్ ప్లాన్ (గ్రోత్) ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టిన డబ్బులు గత ఐదేళ్లలో పెట్టింపు కంటే ఎక్కువ అయి ఉండేవి. ఫాస్ట్ పర్ఫామెన్స్ ని బట్టి వీటిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా హై-రిటర్న్స్ (High-returns) అందుకోవచ్చు.