Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

No Tax On These: ట్యాక్స్ పేయర్లకు అలర్ట్‌.. వాటిపై నో ట్యాక్స్..?

No Tax On These: మనందరం మన కష్టార్జిత డబ్బు మీద పన్ను తక్కువగా కట్టాలని అనుకుంటాం. దీనికోసం చాలా మంది అనేక రకాల పద్ధతులను అనుసరిస్తారు. కానీ, కొన్ని రకాల డబ్బు మీద పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు. అంటే, ఆ డబ్బు మీకు వచ్చినప్పుడు మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మీకు వచ్చిన ఆ డబ్బు మీద ప్రభుత్వం పన్ను వసూలు చేయదు.

 

• వారసత్వం

 

మీ తల్లిదండ్రులు మీకు ఇల్లు, బంగారం లేదా డబ్బు వంటి వాటిని వారసత్వం (Inheritance)గా ఇస్తే, దాని మీద మీరు పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు. మీ పేరు మీద వ్రాసిన వీలునామా/ లేదా మీరే నామినీ అయి ఉంటే మీకు ఆ ఆస్తి వస్తే కూడా పన్ను ఉండదు. కానీ, మీరు ఆ ఆస్తి నుండి సంపాదించే ఆదాయం మీద మాత్రం పన్ను చెల్లించాలి. ఉదాహరణకు, మీరు వారసత్వంగా పొందిన ఇల్లు అద్దెకు ఇస్తే, ఆ అద్దె మీద మీరు పన్ను కట్టాలి.

 

• వివాహ బహుమతులు:

 

మీ వివాహం సందర్భంగా స్నేహితులు లేదా బంధువులు మీకు ఇచ్చే బహుమతులపై మీరు పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు. కానీ, ఆ బహుమతులు (Wedding gifts) మీ వివాహం జరిగిన సమయంలోనే మీరు స్వీకరించాలి. వివాహం జరిగిన ఆరు నెలల తర్వాత బహుమతులు వచ్చినా కూడా పన్ను ఉండదు. కానీ, ఆ బహుమతుల విలువ రూ. 50,000 కంటే ఎక్కువ ఉంటే మీరు పన్ను చెల్లించాలి.

 

• భాగస్వామ్య సంస్థ లాభాలు:

 

మీరు ఒక భాగస్వామ్య సంస్థలో భాగస్వామి అయితే, ఆ సంస్థ నుండి లాభాల వాటాగా (Partnership profits) మీకు డబ్బు వస్తే దానిపై మీరు పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆ లాభాలపై ఆ సంస్థ ఇప్పటికే పన్ను కట్టి ఉంటుంది. కానీ, మీకు ఆ సంస్థ నుండి జీతం వస్తే దానిపై మీరు పన్ను కట్టాలి.

 

• జీవిత బీమా క్లెయిమ్ లేదా మెచ్యూరిటీ మొత్తం:

 

మీరు తీసుకున్న జీవిత బీమా పాలసీ నుండి మీకు వచ్చే క్లెయిమ్ లేదా మెచ్యూరిటీ మొత్తం మీద పన్ను ఉండదు. కానీ, మీరు కట్టిన ప్రీమియం మొత్తం బీమా మొత్తంలో 10% కంటే ఎక్కువ ఉండకూడదు. 10% కంటే ఎక్కువ ఉంటే, ఆ అదనపు మొత్తం మీద పన్ను ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ పరిమితి 15% వరకు ఉండవచ్చు

 

• షేర్లు లేదా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్

 

మీరు షేర్లు లేదా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే, వాటిని అమ్మినప్పుడు మీకు వచ్చే మొదటి రూ.1 లక్ష వరకు ఆదాయం మీద పన్ను ఉండదు. ఈ ఆదాయాన్ని దీర్ఘకాలిక మూలధన లాభం (LTCG) అని అంటారు. కానీ, రూ.1 లక్ష కంటే ఎక్కువ ఆదాయం (Income) వస్తే దానిపై పన్ను చెల్లించాలి.