November Bank Holidays: దాదాపు నాలుగైదు రోజుల్లో అక్టోబర్ (October) మాసాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంటాం. ఈ క్రమంలోనే నవంబర్ నెలలోని వర్కింగ్ ప్రొఫెషనల్స్‌లో లాంగ్ వీకెండ్‌లు, రాబోయే సెలవుల గురించి ఇప్పటికే జనాలు పలు రకాల చర్చలు చేస్తున్నారు. అలాంటి వారు ఈ వార్తని చదవాల్సిందే. నవంబర్ నెలలో సాధారణ వారాంతాలు సహా మొత్తం 14 రోజుల పాటు బ్యాంకులు మూసివేయబడతాయని మీకు తెలుసా? ఈ క్రమంలోనే RBI (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ఈ నెలలో బ్యాంక్ సెలవుల అధికారిక జాబితాను ఒకదానిని విడుదల చేయడం జరిగింది. అయితే ఈ సెలవులు రాష్ట్రాల వారీగా మారుతాయని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి.
‘నవంబర్ 1’న దీపావళి అమావాస్య (Diwali Amavasya) కారణంగా దేశంలోని దాదాపు చాలా రాష్ట్రాల్లో బ్యాంకులకు హాలీడే ఉంటుంది. కర్ణాటక, త్రిపుర, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, జమ్మూ కశ్మీర్, మేఘాలయ, సిక్కిం, మణిపూర్‌లలో బ్యాంకులు మూతపడనున్నాయి. అలాగే ‘నవంబర్ 2’న దీపావళి పండగను పురస్కరించుకుని గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, రాజస్థాన్, సిక్కిం, ఉత్తరప్రదేశ్‌లలో బ్యాంకులకు అధికారిక సెలవు. ఇక ‘నవంబర్ 3’న అయితే ఆదివారం కావడం వలన దాదాపు దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు కూడా మూసివేయబడే ఉంటాయి. అదేవిధంగా ‘నవంబర్ 7, 8’ చూసుకుంటే ఛత్ పూజ సందర్బంగా అసోం, బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు (Bank Holiday) దినం.
ఇక ‘నవంబర్ 9’న 2వ శనివారం కాబట్టి దేశవ్యాప్తంగా బ్యాంకు కార్యకలాపాలు నిర్వహించరు. ‘నవంబర్ 10’ ఆదివారం సెలవు. ‘నవంబర్ 12’ ఎగాస్ బగ్వాల్ ,మేఘాలయలో (Egas Bagwal, Meghalaya) సెలవు. గురునానక్ జయంతి, కార్తీక పూర్ణిమ సందర్భంగా ‘నవంబర్ 15’ తెలంగాణ, ఒడిశా, చండీగఢ్, అండమాన్ నికోబార్ దీవులు, పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అసోం, ఢిల్లీ, హర్యానా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్, మధ్యప్రదేశ్, లక్షద్వీప్, మహారాష్ట్ర, నాగాలాండ్, మిజోరం, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో సెలవు. ఇక నవంబర్ 17 ఆదివారం కాబట్టి సెలవు. అదేవిధంగా నవంబర్ 18న కనకదాస జయంతి సందర్భంగా కర్ణాటకలో బ్యాంకులకు సెలవు ప్రకటించాయి. నవంబర్ 22 రోజు లబాబ్ డుచెన్ సందర్భంగా సిక్కింలో సెలవు. నవంబర్ 23 రోజున నాల్గవ శనివారం కాబట్టి దేశవ్యాప్తంగా సెలవు దినం. ఇక ఆఖరిగా నవంబర్ 24 ఆదివారం కాబట్టి సెలవు ఖాయం. ఇలా నవంబర్‌లో మొత్తం 14 రోజుల పాటు బ్యాంకులు(banks) మూతపడనున్నాయి.