Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Ola Roadster Electric Motorcycle: ఓలా కొత్త ఈ-బైక్ స్పెసిఫికేషన్లు ఇవే

Ola Roadster Electric Motorcycle: ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రిక్ వాహనల (Electric vehicles) పైన ఇష్టం చూపిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహన శ్రేణికి సంబంధించి ఓలా బ్రాండ్ కు మంచి పేరు కూడా సొంతం చేసుకుంది. ఇక అత్యాధునిక ఫీచర్లు, ఆకర్షణీయ హంగులతో ఈ-స్కూటర్లను ఓలా కంపెనీ మార్కెట్లో పరిచయం చేసింది. ప్రస్తుతం మన భారత మార్కెట్లో అత్యధికంగా సేల్ అవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ఓలా కంపెనీవే అని నిపుణుల అంచనా . అలాగే ఓలా స్కూటర్ల నుంచి బైక్ లపై కూడా కంపెనీ ఫోకస్ ను పెట్టింది. ఈ క్రమంలో మూడు మోటార్ సైకిళ్లను ఒకేసారి మార్కెట్ లోకి విడుదల చేసింది. ఇక వాటిని ఓలా రోడ్‌స్టర్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ రేంజ్ పేరిట మార్కెట్లో పరిచయం చేసింది. రోడ్‌స్టర్ ఎక్స్, రోడ్‌స్టర్, రోడ్‌స్టర్ ప్రో (Roadster X, Roadster, Roadster Pro)అనే మూడు వేరియంట్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. వీటిల్లో ప్రారంభ వేరియంట్ రోడ్‌స్టర్ ఎక్స్ ధర రూ. 74,999(ఎక్స్ షోరూం) నుంచి రూ. 99,999(ఎక్స్ షోరూం) మధ్య ఉంటుంది. కాగా కాగా హై ఎండ్ వేరియంట్ రోడ్‌స్టర్ ప్రో రూ. 2 లక్షల(ఎక్స్ షోరూం) నుంచి రూ. 2.50లక్షలు(ఎక్స్ షోరూం) వరకూ ఉన్నటు సమాచారం. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా

ఇక రోడ్‌స్టర్ ఎక్స్ బైక్ మూడు బ్యాటరీ వేరియంట్లలో (Three battery variants) అందుబాటులో ఉన్నటు సంస్థ వారు తెలిపారు.ఇవి 2.5కేడబ్ల్యూహెచ్, 3.5కేడబ్ల్యూహెచ్, 4.5కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో ఉంటుంది. రోడ్‌స్టర్ (Roadster ) కూడా 3.5కేడబ్ల్యూహెచ్, 4.5కేడబ్ల్యూహెచ్, 6కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో అందుబాటులో కూడా ఉంటుంది. అయితే రోడ్‌స్టర్ ప్రో 8కేడబ్ల్యూహెచ్,16కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో కూడా లభిస్తుంది. కాగా ఈ బైక్ లన్నింటికీ ప్రీ బుకింగ్ లను ఓలా ప్రారంభించింది. ఈ ఆర్థిక సంవత్సరం రోడ్‌స్టర్ ఎక్స్, రోడ్‌స్టర్‌ మోడళ్ల డెలివరీలు నాలుగో క్వార్టర్లో ప్రారంభమవుతాయి. అదే సమయంలో రోడ్‌స్టర్ ప్రో డెలివరీలు వచ్చే ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లో కూడా మొదలు అవ్వబోతున్నాయి.

అలాగే ఓలా ఎస్1 స్కూటర్ పోర్ట్‌ఫోలియోతో (S1 scooter portfolio) సమానంగా, బ్యాటరీ వారంటీని మోటార్‌సైకిల్ పోర్ట్‌ఫోలియో మొత్తానికి ఎనిమిదేళ్ల పాటు మనకు అందిస్తుంది. అంతేకాకుండా, వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్ నాటికి కంపెనీ తన ఎలక్ట్రిక్ వాహనాలలో దాని సొంత బ్యాటరీలను ఏకీకృతం చేస్తున్నట్లు కూడా ప్రకనటలో తెలిపింది. ఇది ప్రస్తుతం ఓలా గిగాఫ్యాక్టరీలో ట్రయల్ ప్రొడక్షన్‌లో ఉంది. ఓలా ఎలక్ట్రిక్ భవిష్యత్ వాహనాలన్నీ దాని జెన్-3 ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటాయిట. ఓలా ఈ సంవత్సరం పండుగ సీజన్‌లో తన కొత్త మూవ్ఓఎస్ 5 బీటా వెర్షన్‌ను కూడా మార్కెట్లోకి విడుదల చేయబోతున్నారు.

అలాగే ఓలా కంపెనీ రోడ్‌స్టర్ ఎక్స్ 11కేడబ్ల్యూ పీక్ (Roadster X 11KW Peak) పవర్ అవుట్‌పుట్, రోడ్‌స్టర్ 13కేడబ్ల్యూ పీక్ పవర్ అవుట్‌పుట్, రోడ్‌స్టర్ ప్రో 52కేడబ్ల్యూ పీక్ పవర్, 105ఎన్ఎం పీక్ టార్క్‌ను కూడా ఉత్పత్తి చేస్తుంది. టాప్-ఎండ్ రోడ్‌స్టర్ ఎక్స్ వేరియంట్ 200కిమీ పరిధిని కలిగి ఉంటుందని కంపెనీ క్లయిమ్ కూడా చేస్తోంది. రోడ్‌స్టర్ క్లెయిమ్ చేసిన పరిధి 248కిమీ. రోడ్‌స్టర్ ప్రో టాప్ వేరియంట్ 579కిమీల రేంజ్ ఇస్తుందని కంపెనీ నిపుణులు తెలుపుతున్నారు.