–యుటర్న్ తీసుకున్న విద్యుత్ సంస్థలు
–కొత్త విధానంలో 40 శాతానికి పడిపోయిన వసూళ్లు
–రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మళ్లీ ఆన్ లైన్ కు అంగీకారం
Phone Pay: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: విద్యుత్ వినియోగదారులకు (For electricity consumers)విద్యుత్ సంస్థ లు శుభవార్త అందించింది. విద్యుత్ చెల్లింపుల్లో (In electricity payments)మళ్లీ యూపీఐ పేమెం ట్స్ ను స్వీకరిస్తున్నట్లు కీలక ప్రక టన చేసింది. జులై 1 నుంచి ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి వి ద్యుత్ బిల్లుల చెల్లింపు ప్రక్రియలో మార్పులు వచ్చిన విషయం తెలి సిందే.దీనిలో భాగంగానే ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే (Phone Pay, Google Pay, Paytm, Amazon Pay)వంటి యాప్స్ ద్వారా చెల్లించడం నిలిపివేసినట్లు ఇటు తెలంగాణ, అటు ఎపి విద్యుత్ పంపిణీ సంస్థ లు తెలిపాయి.
కరెంట్ బిల్లుల చెల్లింపులను స్పీడప్ చేసేందుకు భారత్ బిల్ పేమెంట్ (Bill payment)సిస్టమ్ లో చేరాయి. దాని ద్వారానే విద్యుత్ బిల్లులు చెల్లించాలని వినియోగదా రులను కోరాయి. అయితే ఈ కొత్త విధానం అర్ధంకాక గత నెలలో కేవ లం 40 శాతం బిల్లులు మాత్రమే వసూలు అయ్యాయి. ఇక గ్రామీణ ప్రాంతాలలో అయితే విద్యుత్ బిల్లు లు కేంద్రాల వద్ద వినియోగదారులు బారులు తీరారు. పరిస్థితిని గమ నించిన విద్యుత్ బోర్డులో తిరిగి పా త విదానాన్ని అమలు చేస్తునట్లు ప్రకటించాయి. త్వరలోనే గూగుల్ పే (gpay) తోపాటు మరిన్ని యూపీఏ పేమెంట్స్ (UPA Payments)సర్వీసులను అందుబా టులోకి తీసుకురానుంది.