Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Reliance Diwali Gift: రిలయన్స్ వారి దీపావళి గిఫ్ట్ హ్యాంపర్‌ వీడియో వైరల్

Reliance Diwali Gift: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దీపావళి పండుగ (Diwali festival) సంబరాలు మొదలు అయ్యాయి. సాధారణంగా దీపావళి అంటే వెలుగుల పండుగ.. ప్రతి ఒక్కరూ కూడా ఏంతో ఆనందంతో వెలుగులతో నింపుకుని జరుపుకునే సంతోషాల వేడుక అని అందరికి తెలిసిందే.. ఈ పండుగ వేడుకలలో భాగంగా అందరూ ప్రత్యేకించి ఒకరికొకరూ బహుమతులను ఇచ్చి పుచు కుంటారు. అలాగే చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు, సంస్థలు కూడా వారి ఉద్యోగులు,సిబ్బందికి గిఫ్ట్‌లు, బోనస్‌ (Gifts, bonuses) లాంటివి ఇస్తూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.

ఈ తరుణం లో తాజాగా రిలయన్స్ ఫౌండేషన్ (Reliance Foundation) వారి ఉద్యోగులకు ఇచ్చిన గిఫ్ట్ హ్యాంపర్‌ల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది. దీపావళి పండగ నేపథ్యంలో అంబానీలు తమ ఉద్యోగులకు ప్రత్యేక దీపావళి బహుమతిని అందించి అందరిని ఆశ్చర్యపరిచారు. ప్రముఖ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌లో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఈ బహుమతి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక రిలయన్స్ ఇచ్చిన గిఫ్ట్‌ బాక్స్‌లో “దీపావళి శుభాకాంక్షలు” “శుభ్ దీపావళి” అని ఇంగ్లీష్, హిందీలో రాసి ఉన్నటు సమాచారం.

వైట్ బాక్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ (Mukesh Ambani), అతని భార్య నీతా అంబానీ, ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా, ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్, అనంత్ అంబానీ, రాధిక మర్చంట్, కుటుంబంలోని మనవళ్లు, మనరాళ్ల తరపున శుభాకాంక్షలతో కూడిన మెసేజ్‌ కూడా ఉన్నటు మనం చూడవచ్చు వీడియోలో. అయితే, మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది అది ఏమిటంటే .. ఈ గిఫ్ట్ హ్యాంపర్‌లో దృష్టి లోపం ఉన్న కళాకారులు తయారు చేసిన మట్టి దీపం, గ్రీటింగ్ కార్డ్, బాదం ప్యాకెట్, (Clay lamp, greeting card, almond packet,) అగరబత్తీలు, చిన్న వెండి గణేశ విగ్రహం, నార టేబుల్‌క్లాత్ ఇలా అన్ని ఉన్నాయి. ఈ వైరల్ వీడియోను చుసిన నెటిజన్స్ వివిధ రకాలుగా వారి అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేస్తున్నారు.