Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

SBI ALERT: ఎస్‌బీఐ కస్టమర్స్ కి అలెర్ట్

SBI ALERT: ప్రస్తుతం రోజు రోజుకి సైబర్‌ నేరాలు (cyber crimes)భారీగా పెరిగిపోతున్నాయి. కొందరు ప్రజల అత్యాశను, తెలియని తనాన్ని ఆసరాగా చేసుకొని మోసాలకు దారితీస్తున్నారు. ఇక దేశంలో రోజురోజుకీ సైబర్‌ నేరాల బారిన పడుతోన్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలోకేటుగాళ్లు ప్రపంచంలో ఎక్కడో కూర్చొని మన ఖాతాల్లోని డబ్బులను కాజేస్తున్నారు. ముఖ్యంగా నకిలీ మెసేజ్‌ల ద్వారా ఖాతాలను హ్యాక్‌ చేస్తూ డబ్బులు కాజేస్తున్నారు కేటుగాళ్లు. తాజాగా అచ్చం అలంటి రకమైన మోసం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఎస్‌బీఐ (sbi) తమ ఖాతాదారులను అలర్ట్‌ చేస్తూ ముఖ్యమైన సందేశాలను పంపింది.

కస్టమర్స్ ను నకిలీ మెసేజ్‌ల (fake messages)ద్వారా ఖాతాల నుంచి డబ్బులు విత్‌డ్రా అవుతున్నట్లు ఎస్‌బీఐ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎస్‌బీఐ పేరితో వచ్చే ఫేక్ మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం జారీ చేసిన సలహాలో తెలియచేసింది. వాస్తవారినికి గడించిన కొన్ని రోజుల నుంచి రివార్డ్‌ పాయింట్ల (reward points) పేరుతో ఓ మోసం వెలుగులోకి వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. కొందరు సైబర్‌ నేరస్థులు ఎస్‌బీఐ పేరుతో రివార్డులను క్లైమ్‌ చేసుకోవాలంటూ నకిలీ మెసేజ్‌లను సర్క్కూలేట్ చేశారు. ఈ మెసేజెస్ ఓపెన్‌ చేసి, వ్యక్తిగత వివరాలు అందజేసి మోసపోయి కేసులు ఇటీవల చాలా వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయమై ఎస్‌బీఐ ఖాతాదారులను అలర్ట్ చేస్తూ ఈమెయిల్స్‌, మెసేజ్‌లతో పాటు సోషల్‌ మీడియాలో రివార్డ్స్‌ పాయింట్స్‌ పేరిట వస్తున్న ఫ్రాడ్‌ మెసేజ్‌లతో జాగ్రత్తగా ఉండాలని తెలియచేసింది.

అలాగే ఎస్‌బీఐ నెట్‌ బ్యాంకింగ్ రివార్డ్‌ పాయింట్ (reward points) పేరుతో ఓ మెసేజ్‌ వైరల్ అవుతోంది. ఈ మెసేజ్‌ ప్రకారం రూ. 9980 విలువైన పాయింట్లను రీడిమ్‌ చేసుకోవాలని సందేశంలో ఉంటుంది. అయితే ఈ పాయింట్స్‌ను రీడిమ్‌ చేసుకోవాలంటే ఒక ఏపీకే ఫైల్‌ను డౌనల్‌లోడ్‌ చేసుకోవాలని తెలుపుతున్నారు. అయితే ఈ ఏపీకే ఫైల్‌ను (fail) పొరపాటున డౌన్‌లోడ్‌ చేశారో ఇక మీ ఫోన్‌ సైబర్‌ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లడం ఖాయం. దీంతో ఈ ఫోన్‌లో ఉన్న డేటా మొత్తం వారి చేతుల్లోకి వెళ్తుంది. దీంతో మీ ఓటీపీలను సైబర్ నేరస్థులు యాక్సెస్‌ చేయడానికి ఈజీ గా ఉంటుంది. అలాగే వాట్సాప్‌లో కూడా ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయని వీటిపట్ల జాగ్రత్తగా ఉండాలని ఎస్‌బీఐ ఓ ప్రకటనలో కస్టమర్స్ కోసం తెలిపింది. కనుక ఇలాంటి ఫేక్ మెసేజెస్ (fake messages) ఓపెన్ చేయకుండా ఉండడమే ఉత్తమం.