Senior citizens: మన భారతదేశంలో స్థిరమైన పెట్టుబడి కోసం మనం ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఎంచుకోవడం జరుగుతూనే ఉంటుంది. నిజానికి పెట్టుబడికి ఎలాంటి రిస్క్ (risk) లేకుండా రాబడికి హామీ ఉండడంతో ప్రజలు అందరు కూడా బ్యాంకుల ఎఫ్‌డీల్లో (fd)పెట్టుబడి పెట్టేందుకు రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలుగా బ్యాంకులు వడ్డీ రేట్లను (Interest rates) నిరంతరం పెంచడం వల్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ పెట్టుబడిదారులు పెట్టుబడులకు ముందుకు కూడా రావడం జరుగుతుంది .
అయితే బ్యాంకుల మధ్య పెరిగిన పోటీ కారణంగా క్నొఇ బ్యాంకులు కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఎఫ్‌డీలపై ప్రత్యేక ఆఫర్లను కూడా విడుదల చేస్తున్నాయి. ప్రత్యేక ఎఫ్‌డీ (fd) ఆఫర్ల కింది కొన్ని బ్యాంకులు పెట్టుబడిదారులుకు 9 శాతం కంటే ఎక్కువ ఎఫ్‌డీ వడ్డీ రేట్లను కూడా ఇస్తున్నాయి.రూ. 3 కోట్ల కంటే ఎక్కువ మొత్తాలకు సీనియర్ సిటిజన్ ఎఫ్‌డిలపై 9.5 శాతం వరకు ఆఫర్ చేయగా . ముఖ్యంగా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు పెట్టుబడిదారులకు అధిక వడ్డీను ఆఫర్ కూడా ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏయే బ్యాంకులు ఎఫ్‌డీలపై అధిక వడ్డీ రేట్లను అందిస్తున్నాయో? ఓ సారి చూద్దామా..
అధిక వడ్డీ రేట్లు ఇచ్చే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఇవే..
సీనియర్ సిటిజన్ ఎఫ్‌డీలపై (fd) నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మూడు సంవత్సరాల కాలవ్యవధి కోసం తన 9.5% వరకు వడ్డీ రేటును (Interest rates) అందిస్తోంది. సీనియర్ సిటిజన్ల కోసం సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మూడేళ్లలో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై 9.1 శాతం వడ్డీ రేటును ఇస్తుంది .ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు మూడేళ్లలో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై 9.1% వడ్డీ రేటును ఇస్తుంది .జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు మూడు సంవత్సరాల కాలవ్యవధి కోసం తన 8.75 శాతం వరకు వడ్డీ రేటును (Interest rates) ఇస్తుంది .యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు మూడేళ్లలో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై 8.65% వడ్డీ రేటును ఇస్తుంది .ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు మూడేళ్లలో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై 8 శాతం వడ్డీ రేటును(Interest rates) ఇస్తుంది . అయితే ఒక సంవత్సరంలో ఎఫ్‌డీలపై వచ్చే వడ్డీ రూ. 40,000 దాటితే, టీడీఎస్ డిడక్ట్ చేస్తుంది. అయితే సీనియర్ సిటిజన్లకు, వడ్డీ (Interest rates) రూ. 50000 దాటితే 10 శాతం టీడీఎస్ (TDS)డిడక్ట్ చేస్తారు అని అధికారులు తెలువుతున్నారు.