Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

‘Tomato’ descended from the sky ఆకాశం నుంచి దిగొచ్చిన ‘ టమోట’

-- సగానికి సగం తగ్గిన టమోట ధరలు --ములకలచెరువు మార్కెట్‌లో రెండు రోజులుగా తగ్గుముఖం -- నిన్నామొన్నటి వరకు రూ.4300 పలికిన 23 కేజీల బాక్సు ధర రూ.2300కి చేరింది. -- నాణ్యత మేరకు రూ.1500 నుంచి రూ.2300 వరకూ వెళ్లింది -- రిటైల్ ధర కిలో రూ.65 నుంచి రూ.100

ఆకాశం నుంచి దిగొచ్చిన ‘ టమోట’

— సగానికి సగం తగ్గిన టమోట ధరలు
–ములకలచెరువు మార్కెట్‌లో రెండు రోజులుగా తగ్గుముఖం
— నిన్నామొన్నటి వరకు రూ.4300 పలికిన 23 కేజీల బాక్సు ధర రూ.2300కి చేరింది.
— నాణ్యత మేరకు రూ.1500 నుంచి రూ.2300 వరకూ వెళ్లింది
— రిటైల్ ధర కిలో రూ.65 నుంచి రూ.100

ప్రజా దీవెన/ హైదరాబాద్: సామాన్యులను సాధిస్తూ టారెత్చించిన టమోట ధరలు ఊరట నిచ్చాయి. ఆకాశంలో నిలిచిన టమోట ధరలు సగానికి సగం తగ్గడంతో ఆకాశం నుండి దిగొచ్చినట్లయ్యింది.ములకలచెరువు వ్యవసా య మార్కెట్‌లో రెండు రోజులుగా టమోటా ధరలు తగ్గు ముకం పట్టడంతో నిన్నమొన్నటి వరకు రూ.4300 పలికిన 23 కేజీల బాక్సు ధర సగానికి సగం తగ్గి అత్యధికంగా రూ.2300కు చే రింది.

నాణ్యతను బట్టి బాక్సు రూ.1500 నుంచి రూ.2300 వరకు కూడా వెళ్ళింది. నిన్నటి వరకు డబుల్‌ సెంచరీకి చేరువైన కిలో ధర ప్రస్తుతం రూ.65 నుంచి రూ.100కు పడిపోయింది. ధరలు ఇంకా కొన్ని రోజులు అధికంగా ఉంటాయనుకున్న ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టడంతో వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. ఇదిలా వుండగా ధరలు మరింత తగ్గుతాయేమోనని టమోట రైతులు నిరాశ చెందుతున్నారు.

ములకలచెరువు మార్కెట్‌ నుంచి రెండు రోజుల క్రితం వరకు 10 లోపు లారీల టమోటాలు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అయ్యేవి. ప్రస్తుతం ప్రతి రోజూ చిన్న వాహనాలతో పాటు మొత్తం 20 లారీల కాయలు ఎగుమతి అవుతున్నాయి. ఇక్కడి నుంచి ఢిల్లీ, చత్తీస్ గ డ్ , ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు ఎగుమతి అవుతుండగా వైరస్‌ కారణంగా కర్ణాటక రాష్ట్రంలో టమోటా పంటలు దెబ్బతినడంతో ధరలు నిలకడగా ఉండవచ్చని పలువురు రైతులు ఆశగా ఉన్నారు.

గుర్రంకొండ మార్కెట్‌లో ఆదివారం కిలో టమోటా ధర రమారమిగా రూ.88 పలికింది. బయట రాష్ట్రాల్లో టమోటాల దిగుబడి రావడం, స్థానికంగా కూడా రైతులు టమోటా పంటను సాగు చేయడంతో టమోటా దిగుబడి పెరిగింది. వారం రోజుల కిందట మార్కెట్‌ యార్డుకు 100 క్వింటాళ్లలోపు టమోటాలు రాగా ప్రస్తుతం రోజుకు 300 కింటాళ్లకుపైగా వస్తున్నాయి.

ఈ క్రమంలో మూడు రోజులుగా ధరలు తగ్గుముఖం పట్టాయి. గుర్రంకొండ మార్కెట్‌ యార్డులో కిలో టమోటా ధర రూ.88 పలికింది. ఈ లెక్కన 25 కిలోల టమోటా క్రేట్‌ ధర రూ.2200 గరిష్ట ధర పలికింది.