Top 5 Best Selling Scooters:మనం ప్రతి చిన్న పనికి బయటకి వెళ్ళాలి అంటే ముందుగా బైక్స్ , స్కూటర్‌స్ వాడుతూ ఉంటాం అందుకు తగట్టు మోటార్ వాహన కంపెనీ వారు కూడా అనేక మోడల్స్ ను విడుదల చేస్తూ ఉంటారు. మనం ఏపూడైన ముందుగా స్కూటర్ కొనుగోలు చేయాలనుకుంటే, ముందుగా మనం చూసేది మంచి రెస్పాన్స్ వచ్చినవే. అలాగే మంచిగా సేల్ జరిగినవే.ఈ క్రమంలో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన స్కూటర్‌ల జాబితాను (LIST) మనం ఇప్పడూ చూద్దాం. జూలై నెలలో అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ స్కూటర్ల విషయానికి వస్తే ఈ జాబితాలో హోండా యాక్టివా భారీ మార్జిన్‌తో ముందంజలో ఉన్నటు తెలుస్తుంది..
టాప్ 5 స్కూటర్ లు ఇవే ..
జూలై నెలలో 2024లో హోండా యాక్టివా (Honda Activa) 1,95,604 యూనిట్లు విక్రయించినట్లు కంపెనీ తెలియచేసింది. ఈ స్కూటర్ ధర రూ. 76,684 (ఎక్స్-షోరూమ్) నుండి మొదలు అవుతుంది.
జూలై నెలలో 2024లో 2 వ స్కూటర్ టీవీఎస్ జూపిటర్ (TVS Jupiter) 74,663 యూనిట్లు విక్రయాలు జరిగినటు కంపెనీ వారు తెలిపారు. ఇది ఎక్స్-షోరూమ్ ప్రకారం.. ఈ స్కూటర్ ధర రూ. 73,700 నుండి మొదలు అవుతుంది.
జూలై నెలలో సుజుకి యాక్సెస్ (Access to Suzuki) 71,247 యూనిట్లు విక్రయాలు జరిగినట్లు కంపెనీ తెలిపింది. ఎక్స్-షోరూమ్ ప్రకారం.. ఈ స్కూటర్ ధర రూ. 79,899 నుండి మొదలు అవుతుంది.
ఈ ఏడాది జూలై నెలలో హోండా డియో (HONDA DIO)33,447 యూనిట్లు విక్రయించినట్లు కంపెనీ తెలిపింది. ఎక్స్-షోరూమ్ ప్రకారం.. ఈ ఈ 110 సిసి స్కూటర్ ధర రూ. 70211 నుండి మొదలు అవుతుంది.
TVS Ntorq జూలై 2024లో 26,829 యూనిట్లను విక్రయించిందని కంపెనీ తెలిపింది. ఎక్స్-షోరూమ్ ప్రకారం.. ఈ 125 సిసి స్కూటర్ ధర రూ. 89,641, నుండి మొదలు అవుతుంది.
ఈ లిస్ట్ ప్రకారం మనము హోండా యాక్టివా ను తీసుకుంటే బాగా ఉంటుంది అని నా అంచనా.. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి..