Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Traffic Challans: వాహనదారులకు అలెర్ట్ …?

Traffic Challans: ప్రస్తుత రోజులలో ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిన పరిస్థితి ఉంది . ఒక వేళ పాటించకపోతే మాత్రం అంతే సంగతులే అని చెప్పాలి. రూల్స్ సర్రిగా పాటించకపోతే మాత్రం భారీ మొత్తంలో జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే కొన్ని సమయాల్లో జైలుకు (JAIL)కూడా వెళ్లాల్సి ఉంటుంది. అలాగే రూల్ బ్రేకర్ల (Rule breakers)జాబితాలో వాహన సవరణ కూడా చేర్చబడింది. దీనిపై చాలా మందికి అవగాహన లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వారిపై కఠిన చర్యలు కూడా తీసుకుంటారు. అలాగే వ్యక్తుల డ్రైవింగ్ లైసెన్స్‌లను రద్దు చేసి శిక్షించే నిబంధన కూడా ఉంది. అటువంటి పరిస్థితిలో మీరు మీ బైక్‌లో ఏదైనా మార్పు చేసినట్లయితే, మనం జాగ్రత్తగా ఉండాలి. అటువంటి పరిస్థితిలో 25 వేల రూపాయల వరకు చలాన్ కూడా కట్టాల్సి ఉంటుంది.

అలాగే చాలా సార్లు వాహనదారులు తమ మోటార్‌సైకిల్ సైలెన్సర్‌ను (Silencer) కూడా మారుస్తుంటారు. ఇక రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌లో ఉపయోగించే సైలెన్సర్ బైక్ క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. చాలా మంది బైక్‌లో అలాంటి సైలెన్సర్‌ను అమర్చుకుంటారు. దాని శబ్ధం బీభత్సంగా ఉంటుంది. మీరు అలాంటి సైలెన్సర్ ఉపయోగిస్తే పోలీసులు మిమ్మల్ని పట్టుకోవచ్చు. అలాగే, మీపై భారీ చలాన్ కూడా ఉంటుంది.

అలాగే వాహనాల్లో ఎలాంటి ఫ్యాన్సీ నంబర్‌ ప్లేట్‌ను (Fancy number plate) ఉపయోగించడం చట్టవిరుద్ధం అనే చెప్పాలి. అలాగే నంబర్‌ ప్లేట్‌లకు ప్రభుత్వం స్టైల్‌షీట్‌ను ఖరారు చేసింది. దీని కింద నంబర్ ప్లేట్‌లోని అన్ని అంకెలు స్పష్టంగా కనిపించే విధంగా ఉండాలి. వాటిని ఫ్యాన్సీగా రాసి ఉండకూడదు. ఎల్లా వేళ RTO ద్వారా ధృవీకరించబడిన నంబర్ ప్లేట్‌ను వాడుకోవచ్చు.

అలాగే మోటార్‌సైకిల్ లేదా స్కూటర్‌ను సవరించడం కూడా చట్టవిరుద్ధం. ప్రస్తుత రోజుల్లో ట్రాఫిక్ పోలీసులు (Traffic Police) మోడిఫైడ్ మోటార్ సైకిళ్లను పట్టుకుని చలాన్ వేస్తున్నారు. అలాగే కొత్త ట్రాఫిక్ నిబంధనల ప్రకారం, ఏదైనా వాహనంలో మార్పులు చేయడం చట్టవిరుద్ధం అనే చెప్పాలి ఈ క్రమంలో దీని కోసం మీకు జరిమానా కూడా విధించవచ్చు. అలాగే ఇలాంటి సమయాలలో బైక్‌ను కూడా స్వాధీనం చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువే.