ZOMATO: డిజిటల్ పేమెంట్స్ యాప్ పేటిఎం తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ యాప్ సినిమా టిక్కెట్లు (movie tickets), ఇతర ఈవెంట్ల టిక్కెట్లు అమ్ముతుందని సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ రెండు వ్యాపారాలను జొమాటో (ZOMATO)అనే ఫుడ్ డెలివరీ కంపెనీకి అమ్ముతోంది. ఈ డీల్ విలువ రూ.2,048 కోట్లు. ఈ మొత్తాన్ని జొమాటో క్యాష్‌గా ఇస్తుంది. పేటిఎం ఈ విషయాన్ని బుధవారం ప్రకటించింది. ఇక పేటిఎం తమ ప్రధాన వ్యాపారమైన పేమెంట్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ (Payments, Financial Services) మీదే ఎక్కువగా దృష్టి పెడతామని చెప్పింది.
ఈ డీల్ అర్థం ఏంటంటే జొమాటో (ZOMATO) ఇకపై సినిమా టిక్కెట్లు కూడా అమ్ముతుంది. మనం ఒకే యాప్‌లో ఫుడ్ ఆర్డర్ చేయడంతో పాటు సినిమా టిక్కెట్లు కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ డీల్ వల్ల పేటిఎం యాప్‌లో సినిమా టిక్కెట్లు బుక్ చేసే ఆప్షన్ తొలగించే అవకాశం ఉంది. కొంతకాలం తర్వాత జొమాటో (ZOMATO) యాప్‌లోనే సినిమా టిక్కెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
పేటిఎం కింద రెండు చిన్న కంపెనీలు ఉన్నాయి. అవి ‘ఆర్బ్‌జెన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్’, ‘వేస్ట్‌లాండ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్’. ఆర్బ్‌జెన్ అనే కంపెనీ సినిమా టిక్కెట్ల వ్యాపారం చూసుకుంటుంది. వేస్ట్‌లాండ్ అనే కంపెనీ స్పోర్ట్స్, ఇతర ఈవెంట్ల టిక్కెట్ల వ్యాపారం చూసుకుంటుంది. ఇప్పుడు పేటిఎం, తన దగ్గరున్న ఈ రెండు చిన్న కంపెనీలను జొమాటోకు అమ్ముతుంది. అంటే, జొమాటో ఇప్పుడు సినిమా టిక్కెట్లు, స్పోర్ట్స్, ఇతర ఈవెంట్ల టిక్కెట్ల వ్యాపారం కూడా చేస్తుంది.
ఈ డీల్ కారణంగా సుమారు 280 మంది ఉద్యోగులు జొమాటో (ZOMATO) కంపెనీకి వెళ్తున్నారు. ఈ వ్యాపారాన్ని మూడు నెలల లోపు ఈ వ్యాపారం జొమాటోకి అప్పగించాలి. పేటిఎం సినిమా టిక్కెట్ల వ్యాపారం విలువ 1,264.6 కోట్లు రూపాయలు. ఇక ఇతర ఈవెంట్ల టిక్కెట్ల వ్యాపారం విలువ 783.8 కోట్లు రూపాయలు.