29th August is Telugu Language Day ఆగష్టు 29న తెలుగు భాషా దినోత్సవం
-- మన్ కి భాత్ లో ప్రధాన మంత్రి మోధి
ఆగష్టు 29న తెలుగు భాషా దినోత్సవం
— మన్ కి భాత్ లో ప్రధాన మంత్రి మోధి
ప్రజా దీవెన/ న్యూఢిల్లీ: దేశంలో సంస్కృతి, విలువలు, సాంప్రదాయాలు తెలిపేదే తెలుగు భాష అని నరేంద్ర మోధీ పేర్కొన్నారు. తెలుగు భాషా దినోత్సవ నిర్వహణపై భారత ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు.ఆదివారం మాన్ కి బాత్ లో భాగంగా ప్రధాని మాట్లడుతూ ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహిస్తామని ప్రకటించారు.
మాతృభాషతో అనుసంధానమైతే మన సంస్కృతి, విలువలు, సంప్రదాయాలతో మంచి బంధం ఏర్పడుతుందని వెల్లడించారు. దేశంలోని వారసత్వ భాషల్లో తెలుగు కూడా ఒకటని చెప్పారు.తెలుగు సాహిత్యం, వారసత్వ సంపదలో భారతీయ సంస్కృతికి సంబంధించిన అనేక అద్భుతాలు ఉన్నాయని తెలిపారు.
వారసత్వాన్ని యావత్ దేశానికి అందించే ప్రయత్నం తాము చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా చెప్పుకొచ్చారు.