Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Arab countries devostional :అరబ్ లో అద్భుత హిందూ ఆలయo

--అరబ్ దేశాలకు ఆధ్యాత్మిక కేంద్రంగా దేవాలయం --రేపు ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం

అరబ్ లో అద్భుత హిందూ ఆలయo

–అరబ్ దేశాలకు ఆధ్యాత్మిక కేంద్రంగా దేవాలయం
–రేపు ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం

ప్రజా దీవెన, న్యూఢిల్లీ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్  అబుదాబి , అజ్మాన్ , దుబాయ్ , ఫుజైరా , రస్ అల్ ఖైమా , షార్జా, ఉమ్ అల్ క్వైన్ తదితర దేశాల ఏడు ఎమిరేట్ల సమాఖ్యగా కొనసాగుతోంది. పూర్తిగా ఇస్లాం ( islam) మతం రాచరికపు వ్యవస్థ కావడం ప్రతి ఎమిరేట్ కు ఒక పాలకుడు ఆనవాయితీగా వస్తోంది. సదరు పాలకులందరు ముక్తకంఠంతో ఆమోదించి ప్రోత్సహించిన నేపద్యంలో స్వామినారాయణ్ సంస్థ ద్వారా నిర్మించబడుతున్న ఈ ఆలయం (temple) దుబాయ్-అబుదాబి షేక్ జాయెద్ హైవేకి దూరంగా అల్ రహ్బాకు సమీపంలో ఉన్న అబు మురీఖా వద్ద కొలువుదీరింది.

ముస్లిం పాలకుడు సమర్పించుకున్న భూమి, క్యాథలిక్ క్రిస్టియన్ రూపొందించిన ప్రాజెక్ట్, ప్రముఖ్ స్వామి ప్రేరణతో మహంత్ స్వామి మహారాజ్ ఆశీర్వాదంతో ఈ మందిరం అరబ్ దేశాల ( arab countries) సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లాబోతున్నది. యూఏఇ పశ్చిమాసియా, మధ్యప్రాచ్యంలో నిర్మాణమైన మొదటి హిందూ మందిరంగా ఇటలీ నుండి తెల్లని చలువరాళ్ళు, రాజస్థాన్ నుండి గులాబీ రంగు ఇసుకరాళ్లు సేకరించారు.

ఈ రాళ్ళు గుజరాత్, రాజస్థాన్, ఒరిస్సాలోని వివిధ ప్రాంతాల్లోని శిల్పకళా నైపుణ్యం కలిగిన వారసత్వ కళాకారులచే అతి సున్నితం గా, సూక్ష్మంగా శిల్పాలుగా రూపొందాయి. ఆగష్టు2015లో యూఏఇ ప్రభుత్వం అబుదాబిలో మందిరాన్ని నిర్మించడానికి భూమిని అందిం చాలనే నిర్ణయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ మొదటి అధికారిక పర్యటన సందర్భంగా అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.

2018ఫి బ్రవరి 10  వ తేదీన బాప్స్ స్వామి నారాయణ సంస్థ ప్రతి నిధులు షేక్ మొహమ్మద్ భారత ప్రధానిని రాష్ట్రపతి భవన్‌లో కలి శారు. సమస్త రాజకుటుంబం ( royal family) 250 మందికి పైగా స్థానిక నాయకుల సమక్షంలో ఎంఓయూపై (mou) పై సంత కం చేశారు. శంకు స్థాపన కార్యక్ర మం లేదా శిలాపూజ మరుసటి రోజు జరిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) దుబాయ్ ఒపెరా హౌస్ నుండి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వేడుక ను చూశారు.

యూఏఈలో ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ఆల్ నహ్యాన్ ఆలయ నిర్మాణానికి భూమిని కేటాయించగా, 2019లో యూఏఈ టాలరెన్స్ అండ్ కో-ఎగ్జిటెన్స్ మంత్రి షేక్ నహాయన్ ముబారక్ అల్ నహ్యాన్ ఈ ఆలయానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ఆ సమయంలో మంత్రితో పాటు పలువురు అరబ్ ప్రముఖులు పాల్గొన్నారు.

2024 జనవరి 29న 42 దేశాల రాయబారులు, దౌత్యవేత్తలు ఆలయాన్ని సందర్శించారు. యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ (Indian Ambassador Sanjay Sudhir) ఈ పర్యటనను నిర్వహించారు. సరిగ్గా ఐదు సంవత్సరాల తరువాత నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ ఆలయం ఫిబ్రవరి 14వ తేదీ 2024న ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా ప్రారంభం కాబోతోంది.

ఆలయ ప్రారంభానికి ఒక రోజు ముందు, అబుదాబిలోని జాయెద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని భారతీయులు ఉద్దేశిస్తూ ఫిబ్రవరి 13న ‘అహ్లాన్ మోడీ’ గా ఏర్పాటు చేసిన ఒక భారీ సభలో ప్రసంగిస్తారు.

*ఆలయ ప్రత్యేకతలు…* గతంలో అనేక ఆలయాలు విధ్వంసం చేసిన వారి ఇప్పటితరం ఈ నిర్మాణానికి పూనుకోవడం ఒక విశేషం గా చెప్పుకోవచ్చు.అక్కడ 6శాతంగా ఉన్న హిందువులు మాత్రమే కాకుండా అనేక మంది హిందూ జీవనశైలిని అనుస‌రిస్తారు. ఆయు ర్వేదం, శాకాహార సాత్వికాహారం తీసుకుకోవ‌డం, యోగాసనాలు ప్రా ణాయామం వంటి అష్టాంగయోగను అనుస‌రిస్తారు.

భజనలు, కీర్తనలు, యజ్ఞము వంటి వాటిని నిర్వహిస్తూ ఆనందించే వారు. ప్రకృతి ఆరాధకులందరికీ ఈ ఆలయం కేంద్రం కాబోతున్నది. యూఏఈలోని 7 ఏమిరేట్స్‌ని ఆలయ ఏడు శిఖరాలు సూచిస్తుం డగ మొత్తం 27 ఎకరాల్లో ఆలయం నిర్మితమైంది. యూఏఈలోని వేడిని తట్టుకునేందుకు రాజస్థాన్ నుంచి ఇటాలియన్ పాలరాయి, ఇసుకరా యిని తెప్పించి ఆలయ నిర్మాణంలో వాడారు.

పూర్తిగా టెక్ ఫీచర్లు, సెన్సార్లు వంటి వాటిని ఆలయంలో అమర్చారు. ఆలయంలో రెండు గోపురాలు, 7 శిఖరాలు, 402 స్తంభాలు ఉoడగా ప్రతీ శిఖరంపై భారతీయ ఇతిహాసాలు, గ్రంథాల కథలను చెక్కారు. ప్రార్థనా మంది రాలతో పాటు పిల్లలకు ఆట స్థలా లు, గార్డెన్స్, ఫుడ్ కోర్ట్స్, బుక్ స్టోర్స్, గిఫ్ట్ షాపులు ఉన్నాయి.

*ఆలయ ఎత్తు 108 ఫీట్లు* …40,000 క్యూబిక్ ఫీట్ల పాలరాయి ని, 1,80,000 క్యూబిక్ ఫీట్ల ఇసుక రాయిని ఈ నిర్మాణంలో వాడ డం గమనార్హం. ఇక 18 లక్షల ఇటుకలను,300 సెన్సార్లను టెంపుల్ కాంప్లెక్స్‌లో అమర్చారు.రూ.700 కోట్ల ఖర్చుతో సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయ అనే ఋషి వాక్కును నిజం చేస్తూ ప్రజాహితం, ప్రకృతి హితకారకమైన జీవన పద్ధతిలో జీవించి సంపూర్ణమైన శాంతిని, ఆనందాన్ని సుఖాన్ని సంతోషాన్ని పొందాలని అందరం కోరుకుందాం.