Contribution to traditional crafts: సంప్రదాయ చేతివృత్తులకు సహకారం
-- సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టిన కేంద్రం -- దేశవ్యాప్తంగా లక్షలాదిమందికి ఆర్థిక ప్రయోజనం -- విశ్వకర్మ జయంతి సందర్బంగా పీఎం విశ్వకర్మ యోజన ప్రారంభం
సంప్రదాయ చేతివృత్తులకు సహకారం
— సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టిన కేంద్రం
— దేశవ్యాప్తంగా లక్షలాదిమందికి ఆర్థిక ప్రయోజనం
— విశ్వకర్మ జయంతి సందర్బంగా పీఎం విశ్వకర్మ యోజన ప్రారంభం
ప్రజా దీవెన/ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లక్షలాదిమందికి ఆర్థిక ప్రయోజనం చేకూర్చే సరికొత్త పథకానికి శ్రీకారం( Launch of a new scheme of financial benefit) చుట్టిoది కేంద్ర ప్రభుత్వం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ-ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించింది. సంప్రదాయ చేతివృత్తుల వారిని ఆదుకోవడానికి ఉద్దేశించిన పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించారు.
పీఎం విశ్వకర్మ యోజన పేరుతో విశ్వకర్మ జయంతి తో పాటు తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఆర్థికంగా బలోపేతం చేయడానికి, మరింత మెరుగైన జీవన ప్రమాణాలను కల్పించడానికి( To provide a better standard of living) ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయి మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించడానికి ఈ పథకం ఉపయోగపడుతుంది.
ఈ పధకం అమలు కోసం రూ. 13 వేల నుంచి రూ. 15 వేల కోట్ల రూపాయలను ప్రతి సంవత్సరం కేటాయిoచనుంది కేంద్ర ప్రభుత్వం. రుణ సౌకర్యాన్ని మరింత సరళీకరిస్తూ ఎలాంటి బ్యాంక్ గ్యారంటీ లేకుండా( Without any bank guarantee further simplifying the loan facility) రూ.3 లక్షల రూపాయల వరకు రుణాలను అందజేయనుండగా రూ. 3 లక్షల రూపాయలకు పైగా మొత్తాన్ని రుణంగా తీసుకునే నామమాత్రపు వడ్డీ రేటును చెల్లించాల్సి ఉంటుంది.
ఈ పథకం కింద రుణాలను పొందాలనుకునే వారు తొలుత బయోమెట్రిక్ ఆధారిత పీఎం విశ్వకర్మ పోర్టల్‌లో లాగిన్( Biometric based PM Vishwakarma portal login) కావాల్సి ఉంటుంది. సుమారు 18 సంప్రదాయ చేతివత్తులు వడ్రంగి, పడవ తయారీదారు, కమ్మరి, కుమ్మరి, కంసాలి, స్వర్ణకారులు, శిల్పులు, చర్మకారులు, తాపీ పనివాళ్లు, బుట్ట,చాప,చీపురు తయారీదారులు, సంప్రదాయ బొమ్మల తయారీదారు, బార్బర్, పూలదండల తయారీదారు, చాకలి, టైలర్, చేపలు పట్టే వల తయారీదారులు ఈ పథకానికి అర్హులు.
కాగా తొలి సంవత్సరంలో అయిదు లక్షల కుటుంబాలకు బీమా వర్తిస్తుంది. 2024-2028 ఆర్థిక సంవత్సరాల మధ్యకాలంలో మొత్తం 30 లక్ష కుటుంబాలను( A total of 30 lakh families between the financial years 2024-2028) బీమా పరిధిలోకి వర్తింప చేస్తూ పీఎం విశ్వకర్మ సర్టిఫికేట్, గుర్తింపు కార్డును అందజేయడం తో పాటు లబ్ధిదారులకు రూ. 15 వేల విలువ చేసే టూల్‌కిట్ ప్రోత్సాహకాన్ని అందిoచనుంది.