వీరబ్రహ్మేంద్రస్వామి గుడికి విరాళం
ప్రజా దీవెన/నాగార్జనసాగర్: నాగార్జునసాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం తుంగతుర్తి గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గుడికి బుసిరెడ్డి ఫౌండేషన్ ఛైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి రూ. లక్ష వేయి నూట పదహార్ల విరాళం ప్రకటించారు.
ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో దేవాలయం ఉండాల్సిన అవసరం ఉందని, అందుకు తన వంతు సహకారం ఎల్లప్పుడు ఉంటుందని తెలిపారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని దేవాలయాలు అభివృద్ధి చెందడానికి నా వంతు సహకారం ఎల్లప్పుడూ వుంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో తిరుమలగిరి మండలం వైస్ యంపిపి యడవల్లి దిలీప్ కుమార్ రెడ్డి, నిడమానూరు మండలం మాజీ యంపిపి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అంకతి వెంకటరమణ, సర్పంచులు పమ్మి జనార్ధన్ రెడ్డి, సుంకిశాల తండా సర్పంచ్ జ్యోతి రామకృష్ణ నాయక్, గేమ్యానాయక్ తండా సర్పంచ్ నరేష్ నాయక్, శ్రావణ్ కుమార్ రెడ్డి, ప్రభావతి సంజీవరెడ్డి,ఉప సర్పంచ్ మట్టపల్లి ప్రదీప్ రెడ్డి, తుంగతుర్తి గ్రామ పెద్దలు జూపల్లి మల్లయ్య, హర్షవర్ధన్ రెడ్డి,సైదిరెడ్డి,అంతిరెడ్డి, పెద్దవూర మండలం బిసి సెల్ అధ్యక్షుడు మహేష్ యాదవ్, గంగయ్య, సతీష్, సాంబయ్య,సాలయ్య,మేకల శివ, సత్యనారాయణ, వెంకటరెడ్డి, గ్రామ యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు…