Farewell Celebrations : ప్రజా దీవేన,కోదాడ: పట్టణములోని స్థానిక పీఎం శ్రీ బాయ్స్ హై స్కూల్ నందు మంగళవారం పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. కోదాడ మండల విద్యాధికారి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎండి. సలీం షరీఫ్ పాల్గొని మాట్లాడినారు. విద్యార్థులు పరీక్షల సమయంలో ఉపాధ్యాయుల సూచనలు పాటించి, జాగ్రత్తగా పరీక్షలు రాసి వంద శాతం ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు.
సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయుల మార్గదర్శక సందేశాలు, పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు భావోద్వేగాల ఆవేదనలు, మోడ్రన్ డాన్సులు, సాంప్రదాయక నృత్యాలు, ఫోక్ డాన్సులు, ప్రత్యేకంగా ఏక్ బారత్- శ్రేష్టభారత్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ, హర్యానా రాష్ట్రాల సాంప్రదాయక నృత్యాలు, భాష సంభాషణ లు, వంటలు ప్రదర్శన విద్యార్థులను ఉపాధ్యాయులను బాగా ఆకట్టుకున్నాయి.. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు డి. మార్కండేయ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.