Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

‘Gandhi’ movie screening from tomorrow రేపటి నుంచే ‘ గాంధీ ‘ చిత్ర ప్రదర్శన

--థియేటర్ లలో ఉచిత ప్రదర్శనకు రెడీ

నేటి నుంచే ‘ గాంధీ ‘ చిత్ర ప్రదర్శన

 

థియేటర్ లలో ఉచిత ప్రదర్శనకు రెడీ

ప్రజా దీవెన/ నల్లగొండ: భారత స్వాతంత్ర వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాలలో భాగంగా ఈ నెల 14 వ తేదీ నుండి 24 వ తేదీ వరకు రాష్ట్రంలోని సినిమా దియేటర్ లలో జాతిపిత మహాత్మాగాంధీ చలనచిత్రాన్ని ప్రదర్శించనున్నారు. అందులో భాగంగా నల్లగొండ జిల్లాలో 15 థియేటర్ లలో ఉచితంగా ప్రదర్శించుటకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

కాగా 2022 లో వజ్రోత్సవాల ప్రారంభ సమయంలో కూడా విద్యార్ధులలో జాతీయ స్పూర్తిని పెంపొందించే విధంగా గాంధీ చిత్రాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఉచితంగా ప్రదర్శించగా లక్షలాది మంది విద్యార్ధులు వీక్షించినారు. విద్యార్ధులను ధియేటర్ ల వద్దకు ఉచితంగా తీసుకెళ్ళి క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేర్చడం జరిగింది.

ముగింపు ఉత్సవాల సందర్బంగా కూడా దేశ స్వాతంత్రం కోసం ఎంతో పోరాడిన జాతిపిత మహాత్మాగాంధీ జీవిత చరిత్రను తెలియజేసే గాంధీ చిత్రాన్ని కేవలం విద్యార్ధులకు మాత్రమే కాకుండా వారి తల్లిదండ్రులు, సాధారణ ప్రజలు కూడా వీక్షించే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

14 వ తేదీన ఉదయం 8 నుండి 11.30 గంటల వరకు చిత్ర ప్రదర్శన ఉంటుంది. 15 వ తేదీన ఇండిపెండెన్స్ డే సందర్బంగా, 20 వ తేదీన ఆదివారం కారణంగా చిత్ర ప్రదర్శన ఉండదు. 16 వ తేదీ నుండి 24 వ తేదీ వరకు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1.30 గంటలకు వరకు చిత్ర ప్రదర్శన ఉంటుం ది.

జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో దియేటర్ ల నిర్వహకులు, విద్యాశాఖ, రవాణా శాఖ, పోలీసు శాఖ, సమాచార పౌర సంబంధాలశాఖ అధికారులు గాంధీ చలన చిత్ర ప్రదర్శన ఎలాంటి ఆటంకాలు లేకుండా సమన్వయం చేస్తున్నారు.