Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Group-1 exams canceled again: గ్రూప్-1 పరీక్షలు మరోమారు రద్దు

-- పరీక్షలు మళ్ళీ నిర్వహించాలన్న హైకోర్టు

గ్రూప్-1 పరీక్షలు మరోమారు రద్దు

— పరీక్షలు మళ్ళీ నిర్వహించాలన్న హైకోర్టు

ప్రజా దీవెన /హైదరాబాద్: తెలంగాణ గ్రూప్ -1 పరీక్షలు మరోమారు రద్దు అయ్యాయి. జూన్ 11న జరిగిన గ్రూప్ -1 పరీక్షలను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది.

బయోమెట్రిక్ విధానం ఏర్పాటు చేయకపోవడం, హాల్ టికెట్ నెంబర్ లేకుండా ఓఎం షీటు ఇవ్వడంపై తెలంగాణ హైకోర్టును గ్రూప్-1 అభ్యర్ధి ఆశ్రయించారు. కాగా గ్రూప్ -1 పరీక్షలను రద్దు చేస్తునట్లు ప్రకటించిన హైకోర్టు పరీక్షలు మళ్లీ నిర్వహించాలని టీఎస్పీఎస్సీని ఆదేశించింది.

గతంలో పేపర్ లీకేజీ కారణంగా ఒకసారి గ్రూప్ -1 పరీక్ష రద్దు కాగా తాజాగా హైకోర్టు ఆదేశాలతో మరోసారి రద్దయింది. దీంతో పరీక్ష రాసిన అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.