Hello…special tutorial! హలో…ప్రత్యేక భోదకులోస్తున్నారు!
-- ప్రత్యేక అవసరాలకోసం 1523 టీచర్ పోస్టులు --శాశ్వత ప్రతిపాదికన నియామకం --కొత్తగా సృష్టించిన రాష్ట్రప్రభుత్వం --10 మంది విద్యార్థులకు ఒకరి చొప్పున --ఆర్థిక శాఖ ఆమోదంతో జీవో జారీ --డీఎస్సీకి నిర్వహణకు లైన్ క్లియర్
హలో…ప్రత్యేక భోదకులోస్తున్నారు!
— ప్రత్యేక అవసరాలకోసం 1523 టీచర్ పోస్టులు
–శాశ్వత ప్రతిపాదికన నియామకం
–కొత్తగా సృష్టించిన రాష్ట్రప్రభుత్వం
–10 మంది విద్యార్థులకు ఒకరి చొప్పున
–ఆర్థిక శాఖ ఆమోదంతో జీవో జారీ
–డీఎస్సీకి నిర్వహణకు లైన్ క్లియర్
ప్రజా దీవెన/ హైదరాబాద్: తెలంగాణ ప్రజల మౌలిక అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ ముందుకు సాగుతున్న తెలంగాణ లోని కెసీఆర్ ప్రభుత్వం మరో మానవీయ కోణంలో నిర్ణయం తీసుకొన్నది. బుద్ధిమాంద్యత, ఆటిజం, మాస్క్యూలర్ డిస్ట్రోఫీవంటి పలు రకాలైన అంగ వైకల్యాలతో బాధపడుతున్న విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ప్రత్యేకంగా టీచర్లను నియమించాలని నిర్ణయం తీసుకొని ఆ మేరకు శాశ్వత ప్రాతిపదికన స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లను నియమించేందుకు చక చక పావులు కదిపింది.
పది మంది విద్యార్థులకు ఒకరు చొప్పున మొత్తంగా 1,523 స్పెషల్ ఎడ్యుకేషన్ ఫర్ డిజేబుల్డ్ టీచర్ పోస్టులను కొత్తగా మంజూరు చేయడమే కాకుండా ఆయా పోస్టుల నియామకానికి పచ్చ జెండా ఊపింది. ఈ మేరకు శనివారం ఆర్థికశాఖ జీవో నెంబర్-125ను జారీచేసింది కూడా.
వీటిలో ప్రాథమికోన్నత పాఠశాలల్లో 798, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 727 టీచర్ పోస్టులు ఉoడగా ప్రాథమిక పాఠశాలల్లో బోధించే సెకండరీ గ్రేడ్ టీచర్ పే స్కేల్ రూ. 31,040 -92,050, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో బోధించే స్కూల్ అసిస్టెంట్ టీచర్ పేస్కేల్ రూ.42,300 -1,15,270గా ఖరారు చేసింది.
విద్యాశాఖ సర్వే ప్రకారం రాష్ట్రంలో 30వేల వరకు ప్రత్యేకావసరాలు గల చిన్నారులు ఉన్నారు. వీరంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. వీరిలో 10,900 మంది ప్రాథమిక పాఠశాలల్లో, మరో 18,857 మంది ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు.
కొత్తగా మంజూరు చేసిన 1,523 మంది టీచర్ల ద్వారా ప్రత్యేక అవసరాలుగల పిల్లలకు వారి అవసరాల మేరకు విద్యాబోధన చేయనున్నారు.