సాంస్కృతిక సారధులకు సాయం..!
–పిఅర్సీ అమలుకు నిర్ణయం
ప్రజా దీవెన/ హైదరాబాద్:తెలంగాణ సాంస్కృతిక సారధి ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ మరింత సాయం చేయనుంది. సాంస్కృతిక సారధి ఉద్యోగులకు తాజాగా తీపికబురు అందించింది. తెలంగాణా సాంస్కృతిక సారధి ఉద్యోగులకు పీఆర్సీ అమలుచేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.
సాంస్కృతిక, యువజన సర్వీసులు, పర్యాటక శాఖ పెంచిన పీఆర్సీ 2021, జూన్ 1 వ తేదీ నుంచి వర్తింపు చేసేలా కీలక నిర్ణయం తీసుకొని ఆదేశాలు కూడా జారీ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదంతో అధికారులు ఉత్తర్వులు వెలువరించారు.
తెలంగాణా సాంస్కృతిక సారధి ఉద్యోగుల ప్రస్తుత పే స్కేలు రూ. 24,514 లుగా ఉoడగా ఇకపై పీఆర్సీ అమలుతో ఒక్కొక్కరికి రూ. 7300ల మేరకు జీత భత్యాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు.