Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Indian Railways bumper offer: భారత రైల్వే బంపర్ ఆఫర్

--వంద రూపాయలకే రూమ్ ఫెసిలిటీ --ఆఫర్ ప్రకటిస్తున్న ఇండియన్ రైల్వేస్

భారత రైల్వే బంపర్ ఆఫర్

–వంద రూపాయలకే రూమ్ ఫెసిలిటీ
–ఆఫర్ ప్రకటిస్తున్న ఇండియన్ రైల్వేస్

ప్రజా దీవెన/న్యూఢిల్లీ: భారతదేశంలో రైళ్ళు ప్రతిరోజు భూ భ్రమణం మాదిరిగా పరిగెడుతూనే ఉంటాయి. అందులో భాగంగా అడపాద డపా ఏమిటి తరచుగానే రైళ్లు ఆలస్యంగా నడవడం పరిపాటిగా ( Trains are often late) మారింది. ఇండియాలో రైళ్లు కొన్నిసార్లు చాలా ఆలస్యంగా వస్తాయి. అలాంటప్పుడు రైలు కోసం వేచి చూడడం సహజమే.

ఒక్కోసారి రైళ్ల కోసం విసుకొచ్చే విధంగా వేచి చూడాల్సి వస్తుంది. అలాంటప్పుడు కొద్దిసేపు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలని పిస్తుం ది. ఈ క్రమంలో సమీపంలోని హోటల్లో విడిది చేయాలంటే వ్యయ ప్రయాసలకు ( Staying in a hotel is expensive) సంబంధించి తలనొప్పులు తప్పదు.

అయితే ప్రయాణి కులకు ఈ భారం లేకుండా రైల్వే స్టేషన్‌లో రిటైరింగ్ రూమ్ ఫెసిలిటీని ( Retiring room facility at railway station) IRCTC అందిస్తోంది. ఈ రిటైరింగ్ రూమ్‌లు హోటల్‌లు, లాడ్జీ లకు ప్రత్యామ్నాయంగా IRCTC అందించే చౌక, సౌకర్యవం తమైన గదులు. బడ్జెట్, ప్రాధాన్యతను బట్టి ఏసీ లేదా నాన్-AC గదులు ఎంచుకోవచ్చు.


ఈ రూమ్ ధరలు రూ.100 నుంచి రూ.700 మధ్య ఉంటాయి. స్టేషన్, గది రకాన్ని బట్టి ఈ ధరలు చేంజ్ అవుతుంటాయి (These prices vary depending on the type of room) . ఉదాహరణకు, ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో, నాన్-ఏసీ గదిని 12 గంటలకు రూ.150, లేదా 24 గంటలకు ఏసీ గదిని రూ.450కి బుక్ చేసుకోవచ్చు.

IRCTC వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా రిటైరింగ్ రూమ్‌ ను ఆన్‌లైన్‌ లో బుక్ చేసుకోవచ్చు. ఈ రూమ్ బుక్ చేసేటప్పుడు మీ కు కన్ఫామ్డ్ లేదా RAC టిక్కెట్‌తో వాలీడ్ అయ్యే PNR నంబర్ అవసరమవు తుంది. టికెట్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నట్లయితే రిటైరిం గ్ రూమ్‌ని బుక్ చేయడం కుదరదు. స్టేషన్‌లో రిటైరింగ్ రూమ్‌ను ఆఫ్‌లైన్‌లో కూడా బుక్ చేసుకోవచ్చు, అయితే టిక్కెట్ కౌంటర్‌తో లభ్యత, రిజర్వే షన్ స్లాట్లను చెక్ చేయాలి.

కనీసం 1 గంట, గరిష్టం గా 48 గంటల వరకు రిటైరింగ్ రూమ్ బుక్ చేసుకోవచ్చు. కొన్ని స్టేష న్లు తక్కువ వ్యవధిలో గంటకు బుకింగ్స్‌ను కూడా అందిస్తాయి. మీకు మరింత సమయం కావాలంటే బుకింగ్‌ను పొడిగించవచ్చు, కానీ రెండవ స్లాట్‌కు 25% సర్‌ఛార్జ్ చెల్లించాలి. ఉదాహరణకు, మీరు 24 గంటల పాటు గదిని బుక్ చేసి, ఆపై దాన్ని మరో 24 గంటల పాటు పొడిగిస్తే, మీరు రెండవ 24 గంటలకు 25% అదనంగా మనీ చెల్లించాలి.

మనసు మార్చుకుంటే మీ బుకింగ్‌ను రద్దు చేసుకోవచ్చు, కానీ కొంత డబ్బును కోల్పోవాల్సి వస్తుంది. బుకిం గ్‌ను ఎప్పుడు రద్దు చేసారనే దానిపై తగ్గింపు మొత్తం ఆధార పడి ఉంటుంది. మీరు బుకింగ్ చేసిన అదే రోజున రద్దు చేస్తే, మీకు ఎలాంటి వాపసు లభించదు.