Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

International recognition of Hyderabad… Do you know why: హైదరబాద్ కు అంతర్జాతీయ గుర్తింపు… ఎందుకో తెలుసా

-- భద్రతాపరంగా ప్రపంచ స్దాయిలో అరుదైన గౌరవం -- బెస్ట్‌ లివింగ్‌ సిటీగా ఇప్పటికే గుర్తింపు..తాజాగా భద్రత విషయంలో --విశ్వవ్యాప్తంగా తొలి 50 నగరాల జాబితాలో హైదరాబాద్‌ 41వ స్థానంలో

 

హైదరబాద్ కు అంతర్జాతీయ గుర్తింపు… ఎందుకో తెలుసా

— భద్రతాపరంగా ప్రపంచ స్దాయిలో అరుదైన గౌరవం
— బెస్ట్‌ లివింగ్‌ సిటీగా ఇప్పటికే గుర్తింపు..తాజాగా భద్రత విషయంలో

–విశ్వవ్యాప్తంగా తొలి 50 నగరాల జాబితాలో హైదరాబాద్‌ 41వ స్థానంలో

ప్రజా దీవెన/ హైదరాబాద్: హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. ఊహించని విధంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరం ఇప్పటికే పలు రంగాల్లో స్థానం సుస్థిరం చేసుకున్న విషయం విదితమే. హైదరాబాద్ కు ఐక్య రాజ్య సమితి యూఎస్‌ స్టాటిస్టికల్‌ విభాగం అంతకుముందే నిర్వహించిన సర్వేలో బెస్ట్‌ లివింగ్‌ సిటీగా, పెట్టుబడుల విభాగంలో సేఫెస్ట్‌ సిటీ గా ప్రతిష్టను దక్కించుకున్న మన హైదరాబాద్‌ మహానగరం తాజాగా భద్రత అంశంలోనే ( Our city of Hyderabad, which has earned the reputation as the safest city, is the latest in the matter of safety) దశంలో రెండో స్థానంలో నిలిచింది.

విశ్వనగరం వైపు విస్తరిస్తున్న హైదరాబాద్‌ చాలా భద్రమని యూఎస్‌ స్టాటిస్టికల్‌ సర్వే తేల్చి చెప్పింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభత్వం హైదరాబాద్ లో శాంతి భద్రతల పర్యవేక్షణకు అత్యంత ప్రాధాన్యత (The BRS government has given top priority to monitoring law and order in Hyderabad) ఇచ్చిందని అభిప్రాయపడింది.

ఎటువంటి సందర్భాల్లోనూ లా అండ్ ఆర్డర్ కు విఘాతం లేకుండా చర్యలు తీసుకోవడంతో ఉపాధి అవకాశాలు, పారిశ్రామిక, ఐటీ రంగాల్లో పెట్టుబడులే కాకుండా అత్యంత పటిష్టమైన భద్రత గల నగరాల్లో తెలంగాణ రాష్ట్ర రాజధానికి ప్రతిష్టాత్మక గుర్తింపు దక్కిందని ( The state capital of Telangana has got the prestigious recognition among the cities with the strongest security) చెప్పవచ్చు.

హైదరాబాద్‌ నగరం చుట్టూ 380 కిలోమీటర్ల పరిధిలో చీమ చిటుక్కుమన్నా ఇట్టే పసిగట్టే విధంగా నిఘా వ్యవస్థను పటిష్టం చేసిన నేపథ్యంలో దేశంలోనే రెండు టాప్‌ సిటీల్లో ఒకటిగా నిలువడమే కాకుండా విశ్వవ్యాప్తంగా తొలి 50 నగరాల జాబితాలో హైదరాబాద్‌ 41వ స్థానంలో ( Apart from being one of the two top cities in the country, Hyderabad is ranked 41st in the list of top 50 cities worldwide) నిలిచింది.

అత్యుత్తమ సర్వేలైన్స్‌ వ్యవస్థను కలిగిన తొలి 20 జాబితాలో చైనాలోని పలు నగరాలు అత్యంత కీలకమైనవి కాగా, ఉత్తమ 50 నగరాల్లో భారత్‌ నుంచి ఢిల్లీ 22, హైదరాబాద్‌ 41వ స్థానంలో ( Apart from being one of the two top cities in the country, Hyderabad is ranked 41st in the list of top 50 cities worldwide) నిలిచాయి. అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన పర్యవేక్షణ వ్యవస్థను కలిగిన నగరాల జాబితాను ప్రముఖ అధ్యయన సంస్థ వరల్డ్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ వెల్లడించింది.

జనాభా, సీసీ కెమెరాలు, నగర విస్తీర్ణం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని రూపొందించిన ఈ జాబితాలో హైదరాబాద్‌కు ఉత్తమ స్థానం దక్కింది. ఈ నివేదికలో పలు అంశాలను వెల్లడించారు. హైదరాబాద్‌ లో ప్రతీ వెయ్యి మంది నివాసితులకు 36.52 కెమెరాలు ఉన్నట్లు వెల్లడించారు.

అయితే ఈ జాబితాలో మొదటి స్థానంలో 117 సీసీ కెమెరాలతో చైనా దేశంలోని టైయావున్‌ నగరం ఉండగా ఇండియాలోని ఇండోర్‌ 64.4 కెమెరాలతో నాలుగవ స్థానంలో, 33.73 కెమెరాలతో రాజధాని ఢిల్లీ16వ స్థానంలో ఉన్నాయి .హైదరాబాద్ లో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత నిఘా మరింత పటిష్టమైంది.

నగరంలోని 10 లక్షల కెమెరాలు కమాండ్‌ కంట్రోల్‌తో అనుసంధానం చేశారు. నగరంలో అదనంగా 5.80 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మొత్తం 10 లక్షల కెమెరాలను కంట్రోల్‌లోకి చేశారు. దీంతో అడుగడుగూ సీసీ కెమెరాలో నిఘాలోకి వెళ్లింది. ఇప్పుడున్న మన హైదరాబాద్‌ మహానగరం దేశానికి ఆదర్శంగా నిలిచే కమాండ్‌ కంట్రోల్‌ వ్యవస్థను( Hyderabad city is an exemplary command and control system for the country) కలిగిఉంది. టాప్‌ 20 నగరాల్లో ఇండియా నుంచి మూడు నగరాలు ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది.