It is customary to worship village deities..! గ్రామదేవతలను ఆరాదించిడం ఆనవాయితీ..!
-- సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీతి -- పట్టణ ప్రజలపై ఊర ముత్యాలమ్మ కరుణ చూపాలి -- ముత్యాలమ్మ బోనాల పండుగను సందర్బంగా మంత్రి జగదీష్ రెడ్డి
గ్రామదేవతలను ఆరాదించిడం ఆనవాయితీ..!
— సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీతి
— పట్టణ ప్రజలపై ఊర ముత్యాలమ్మ కరుణ చూపాలి
— ముత్యాలమ్మ బోనాల పండుగను సందర్బంగా మంత్రి జగదీష్ రెడ్డి
ప్రజా దీవెన/సూర్యాపేట: బోనాల పండుగ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబింప చేస్తాయని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.గ్రామ దేవతలను ఆరాధించి బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవడం శతాబ్దాల క్రితం మొదలైందని ఆయన చెప్పారు.అటువంటి అనవాయితీని కొనసాగిస్తూ క్రమశిక్షణ తో బోనాల పండుగ నిర్వహించుకుంటున్న సూర్యపేట పట్టణ ప్రజలకు మంత్రి జగదీష్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
సూర్యపేట పట్టణంలోనీ అత్యంత ప్రాశస్త్యం కలిగిన ఊర ముత్యాలమ్మ బోనల పండుగను పురస్కరించుకుని మంత్రి జగదీష్ రెడ్డి,ఆయన సతీమణి సునీతా జగదీష్ రెడ్డిలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ పట్టణ ప్రజలపై ఊర ముత్యాలమ్మ కరుణా కటాక్షాలు చూపాలని ప్రార్దించినట్లు ఆయన వెల్లడించారు.
ప్రకృతికి అనుకూలంగా బోనాల పండుగ నిర్వహిస్తున్నందున ఊర ముత్యాలమ్మ తో పాటు ప్రకృతి కరుణించి సకాలంలో వర్షాలు పడేలా చూడాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. తద్వారా పంటలు బాగా పండి ప్రజల ఆదాయం పెరగాలని ముత్యాలమ్మ తల్లికి విన్నవించుకున్నట్లు ఆయన చెప్పారు.
తెలంగాణా సంస్కృతి సంప్రాదాయాలకు గ్రామ దేవతలను కొలుస్తూ బోనాల పండుగ నిర్వహించుకోవడం సంప్రదాయంగా వస్తుందన్నారు.అటువంటి సంప్రదాయాన్ని కొనసాహిస్తున్న ప్రజలను ఆయన అభినందించారు.