Komati Reddy who stood by with financial support: ఆర్థిక తోడ్పాటుతో అండగా నిలిచిన కోమటిరెడ్డి
పానగల్ చిన్నారులకు రూ.లక్ష ఆర్థిక సాయం -- నల్లగొండ, కనగల్ లలో నాలుగు కుటుంబాలకు రూ. 20వేల చొప్పున
ఆర్థిక తోడ్పాటుతో అండగా నిలిచిన కోమటిరెడ్డి
— పానగల్ చిన్నారులకు రూ.లక్ష ఆర్థిక సాయం
— నల్లగొండ, కనగల్ లలో నాలుగు కుటుంబాలకు రూ. 20వేల చొప్పున
ప్రజా దీవెన/ నల్లగొండ: మాజీ మంత్రి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి మరోసారి దాతృత్వం చాటుకున్నారు. నల్లగొండ పట్టణం పానగల్ లో రోడ్డు ప్రమాదoలో మరణించిన చిన్నారులకు రూ. లక్ష, నల్లగొండలో రెండు, కనగల్ మండలంలో రెండు కుటుంబాలకు మొత్తం నలుగురికి రూ. 20వేల చొప్పున మొత్తంగా మంగళవారo ఒక్కరోజే మృతుల కుటుంబాలకు రూ.1.80 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.
ప్రకటించిన ఆర్ధిక సాయాన్ని నల్లగొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి ద్వారా బాధిత కుటుంబాలకు అందజేశారు. నల్లగొండ పట్టణంలోని 1వ వార్డు పానగల్ లో రోడ్డు ప్రమాద బాధితులు ఓర్సు విష్ణు, స్వప్నల కుటుంబానికి రూ.1లక్ష రూపాయల సహాయం చేశారు.
పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డిఓర్సు విష్ణు-స్వప్న దంపతుల పార్థివ దేహాలను సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఎంపీ కోమటిరెడ్డి పంపిన రూ. 1లక్ష పిల్లల పేరు మీద ఫిక్స్ డిపాజిట్ చేయాలని అందజేశారు.
అదేవిధంగా నల్లగొండ పట్టణంలో అనారోగ్యంతో మృతి చెందిన రెండు కుటుంబాలకు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రూ.40 ఆర్థిక సహాయం చేశారు.27వ వార్డు అశోక్ నగర్ కాలనీకి చెందిన బొమ్మల కౌశల్య, 28వ వార్డుకు చెందిన కొండ కృష్ణయ్య ల కుటుంబాలకు రూ. 20 వేల చొప్పున అందజేశారు.
ఇక కనగల్ మండలం జి ఎడవెల్లి గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన బండమీది యాదమ్మ, పగిడిమర్రి గ్రామంలో పగిడిమర్రి లింగయ్య ల కుటుంబాలకు రూ. 20వేల చొప్పున ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈరోజు నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, కనగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం అనుప్ రెడ్డిలు యాదమ్మ పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలు వేసి నివాళులర్పించారు.
అనంతరం కుటుంబ సభ్యులకు ఎంపీ కోమటిరెడ్డి పంపిన రూ.20 వేలను అందజేశారు.ఈ కార్యక్రమంలో నల్లగొండ జడ్పిటిసి వంగూరు లక్ష్మయ్య, కౌన్సిలర్ బుర్రి రజిత యాదయ్య, ఆలకుంట నాగరాజు, పరాడ వెంకన్న, ఓర్సు రమేష్, గజ్జి సురేష్, గాదరి యాదయ్య, రుద్రాక్ష వెంకన్న, నాగార్జున, సురేష్, జానీ, పల్లారెడ్డి వెంకట్ రెడ్డి, ఓర్సు సాయిలు, ఆదినారాయణ, మాజీ కౌన్సిలర్ సట్టు శంకర్, గుండెబోయిన మల్లయ్య యాదవ్, దేవుని వెంకన్న, మామిడి కార్తీక్ , సర్పంచి నర్సింగ్ కృష్ణయ్య, రాజిరెడ్డి, ఆవుల నరేందర్, పర్సనబోయిన సైదులు, వంశీ , పగిడిమర్రి సర్పంచ్ గోలి నర్సిరెడ్డి, జగాల్ రెడ్డి, పగిడిమర్రి వెంకన్న, సుంకిరెడ్డి వెంకటరెడ్డి,సింగం సత్తయ్య, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.