** భక్తుల కోరికలు తీర్చాలని మొక్కులు..
**శ్రీ వెంకటేశ్వర విద్యా మందిరి విద్యార్థులతో సంస్కృతి కార్యక్రమాలు
**గ్రామ ప్రజలను చల్లగా చూడు శివయ్య ..భక్తులు పూజలు
Maha Shivratri : ప్రజా దీవెన/ కనగల్: మండల కేంద్రంలోని పురాతన ఉన్న శివాలయం బ్రహ్మోత్సవాలు ముస్తాబయింది శివరాత్రి పర్వదిన సందర్భంగా ఆది దంపతుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించడానికి వంశపారపర్య అర్చకులు గ్రామ పెద్దలు ప్రజలు తదితరులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు కనగల్ గ్రామంలోని అతి ప్రాచీనమైన శివాలయంలో ప్రతి సంవత్సరంలో శివరాత్రి పర్వదినంగా పార్వతి బండి రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు..
స్వామివారు గ్రామంలో నిలిచిన చరిత్ర
పురాతనమైనది కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ ప్రదేశం దట్టమైన అరణ్యముగా ఉండేది హాలయ నది పరివాహక ప్రదేశం కావడం వలన ఈశ్వరుడు స్వయంభుగా వెలిసినాడు ఈ ప్రదేశమున వాల్మీకం( పుట్ట) ఉండేది ఒక రైతు ఉలవల బండితో పోవచ్చు దారి తప్పి చీకటిలో ఆ పుట్టపై నుండి బండి పోయినది అందులో నుండి శివలింగం ఆవిరిభవించి ఆ రైతుకు స్వప్నంలో స్వామివారి కనిపించి నన్ను ఇక్కడ ప్రతిష్టముపమని కోరినందున ఆ రైతు అక్కడ ఒక శివాలయం కట్టించి స్వామివారికి బండి రామలింగేశ్వర స్వామి అని పేరు పెట్టి పూజించనరంభించారు తదుపరి కొన్నాళ్లకు రెడ్డి రాజుల కాలంలో దేవాలయం పునర్నిర్మాణ.నిర్మాణ మండప నిర్మాణములు గావించబడినట్టు దేవాలయం శాసముల ద్వారా తెలియజేశారు..
శివుని పూజా కార్యక్రమాలు..
25 -2 -2025 ఉదయం 6 గంటల నుండి గణపతి పూజ శైవ శుద్ధి మహా పుణ్యవాచనం అంకుర్పణ అఖండ దీపారాధన వాస్తు పూజ హోమం.. 26 -2- 2025 మా శివరాత్రి రోజున ఉదయం ఆరు గంటల నుండి పంచమృతం సహిత మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం రాత్రి జాగరణ భజన తదుపరి తీర్థప్రసాదల వినియోగం 27- 2- 2025 ఉదయం 7 గంటలకు ఎదుర్కోలు తదినంతరం పార్వతి బండి రామలింగేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం (తలంబ్రాలు )తదుపరి తీర్థ ప్రసాదం వినియోగం రాత్రి నంది వాహనం సేవ 28- 2 -2025 తెల్లవారుజామున అగ్నిగుండాలు..
(రాత్రి ) శ్రీ వెంకటేశ్వర విద్యా మందిర్ స్కూల్ విద్యార్థులు తో సంస్కృతి కార్యక్రమంలో ఉన్నాయి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అర్చకులు కోరుతున్నారు..