Mahaprasthanam is great : మహాప్రస్థానం మహాద్భుతం
--అర్ధరాత్రి తర్వాత మహాప్రస్థానం లో తనికెళ్ళ భరణి --శివయ్య చెంత చిత్తంతో పరవశించిన భరణి -- సాహితీ సభ కు హాజరై మహాప్రస్థానం పై అరాతీసిన తనికెళ్ల -- మంత్రి జగదీష్ రెడ్డి తో కలిసి మహా ప్రస్థానం సందర్శన --ధన్యోస్మి అంటూ మంత్రి జగదీష్ రెడ్డి కి కితాబు
మహాప్రస్థానం మహాద్భుతం
–అర్ధరాత్రి తర్వాత మహాప్రస్థానం లో తనికెళ్ళ భరణి
–శివయ్య చెంత చిత్తంతో పరవశించిన భరణి
— సాహితీ సభ కు హాజరై మహాప్రస్థానం పై అరాతీసిన తనికెళ్ల
— మంత్రి జగదీష్ రెడ్డి తో కలిసి మహా ప్రస్థానం సందర్శన
–ధన్యోస్మి అంటూ మంత్రి జగదీష్ రెడ్డి కి కితాబు
ప్రజా దీవెన/సూర్యాపేట: అర్థరాత్రి దాటిన తర్వాత సూర్యాపేట సమాజం మైమరిచి నిద్రిస్తున్న వేళ మహా ప్రస్థానం పట్టణప్రజలు ప్రశాంతంగా నిద్రిస్తున్న వేల మహ ప్రస్థానం లో ఔరా అనిపించే రీతిలో పరవశాలు స్పృశించాయి. సూర్యాపేట మహాప్రస్థానం లో కొలువైన పరమశివుడి చెంత చిత్తం లో మునిగిపోయారు ( Suryapeta was immersed in the mind of Lord Shiva who was measured in Mahaprasthanam) సినీ నటుడు, కవి, రచయిత తనికెళ్ల భరణి. మహా ప్రస్థానం మహాద్భుతమంటూ మంత్రి జగదీష్ రెడ్డికి కితాబులిచ్చారు.
సూర్యాపేట లో రాత్రి సాహిత్య సభ కు హాజరైన భరణి అక్కడ కవుల ప్రసంగం లో మహప్రస్థానం గురించి తెలుసుకుని సంబ్రమాశ్చర్యాలకు ( To know about Mahaprasthanam and be amazed) గురయ్యారు. ఆ వెంటనే సందర్శించాలని నిర్ణయించుకున్న తనికెళ్ళ, తన మనసులోని కోరికను సభకు ముఖ్య అతిథిగా హాజరైన జగదీష్ రెడ్డికి తెలిపారు.
ఆయన అడిగిందే తడవుగా అర్ధరాత్రి 1:30గంటలకు తనికెళ్ల భరణి ను మంత్రి జగదీష్ రెడ్డి స్వయంగా మహాప్రస్థానం సందర్శనకు ( Minister Jagdish Reddy himself left Tanikella Bharani at 1:30 midnight to visit the Mahaprasthanam) తీసుకెళ్లారు. అక్కడికి చేరుకోగానే మహా ప్రస్థానంలో కొలువుదీరిన పరమశివుడి విగ్రహాన్ని చూసి పరవశించిపోయి సుమారు గంట సేపు శివచిత్తం లో మునిగితేలారు. స్మశాన వాటిక నలుమూలల కలియ తిరుగుతూ మహా అద్భుతం అంటూ ( It is a great miracle that the cemetery is moving everywhere) జాషువా పద్యాన్ని నెమరవెసుకున్నారు.
ఇచ్చోట నేసత్కవీంద్రుని కమ్మని కలము, నిప్పులలోనఁ గఱఁగిపోయె యిచ్చోట నేభూములేలు రాజన్యుని యధికారముద్రిక లంతరించె యిచ్చోటనే లేఁత యిల్లాలి నల్లపూ సలసౌరు గంగలోఁ గలసిపోయె యిచ్చోట నెట్టిపే రెన్నికంగనుఁగొన్న చిత్రలేఖకుని కుంచియె నశించె ఇది పిశాచులతో నిటలేక్షణుండు గజ్జె గదలించి యాడు రంగస్థలంబు ఇది సరణదూత తీక్ష్ణమౌదృష్టు లొలయ నవనిఁ బాలించు భస్మసింహాసనంబు అంటూ పరవశించి పోయారు.
ఇంతటి అద్భుత మహాప్రస్థానాన్ని 20 ఏళ్ల క్రితం యూరప్ లో చూశాను ( I saw such a wonderful grandeur in Europe 20 years ago) అన్న తనికెళ్ళ అక్కడ సైతం స్మశానం ఇరుకుగా ఉందన్నారు. ఆ తర్వాత మొట్టమొదటిసారిగా సూర్యాపేటలోనే అంతటి నిర్మాణాన్ని చూస్తున్నానని పేర్కొన్నారు.
ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సువిశాలంగా, అహ్లాదకరంగా రూపుదిద్దుకున్న మహాప్రస్థాన దర్శనభాగ్యం ( Maha prasthana darshanabhagyam is spacious and pleasantly designed to inspire spirituality) ఇచ్చిన మంత్రి జగదీష్ రెడ్డి తో ధన్యోస్మి అంటూ ఆనందబాష్పాలతో వెనుదిరిగారు.