మహోద్యమంగా గ్రీన్ ఇండియా చాలెంజ్
—రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్
ప్రజా దీవెన/జగిత్యాల: తెలంగాణ లో ముచ్చటగా మూడు మొక్కలతో ఆరంభమై అంగరంగ వైభవంగా ప్రజల భాగస్వామ్యంతో ఐదేండ్ల లో మహా ఉద్యమంగా మారిందని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త,ఎంపీ సంతోష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.శనివారం గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా కొడిమ్యాల రిజర్వ్ ఫారెస్ట్ లో మంత్రులు ఇంద్ర కరణ్ రెడ్డి, గంగుల కమలాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, స్ధానిక శాసన సభ్యులు సుంకే రవి శంకర్ లతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు.
తద్వారా తొలి దశలో కొడిమ్యాల రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో మొత్తం 1,094 ఎకరాల అటవీ భూమిని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా దత్తత తీసుకొని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ మీడియాతో మాట్లాడారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ మొదలై ఐదు సంవత్సరాలు పూర్తిచేసుకుని ఆరో సంవత్సరంలోకి అడుగు పెట్టిందన్నారు.
ఆరవ విడతలో పచ్చదనం పెంపు, ప్లాస్టిక్ కాలుష్యం, నియంత్రణ, అవగాహనపై కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తెలంగాణ తో పాటు దేశ వ్యాప్తంగా సంవత్సరాల కాలంలో లక్షలాది మొక్కలను నాటి, వాటిని సంరక్షించామన్నారు. మొక్కలకు నాటుతూ పచ్చదనం ను పెంచుతున్న ప్రకృతి ప్రేమికులు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు’ అని ఎంపీ సంతోష్ అన్నారు.
రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర కరణ్ రెడ్డి మాట్లాడుతూ కొండగట్టు అంజనేయ క్షేత్రం అత్యద్భుతంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారని తెలిపారు. అటవీ, దేవాలయాల ప్రేమికులుగా ఎంపీ సంతోష్ కుమార్ సీఎం కు తోడ్పాటుగా ఒక కోటి 4 లక్షల రూపాయలతో కొండగట్టు అటవీ ప్రాంతం ను దత్తత తీసుకుని అటవీ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం చేపట్టనుండడంతో ఈ అటవీ ప్రాంతం దట్టమైన అటు ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందన్నారు.
కొండగట్టు అటవీ క్షేత్రం నుంచి 100 కిలోమీటర్ల పరిధిలోని ప్రజలకు సరిపడా ఆక్సిజన్ అందుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంతో 265 కోట్ల మొక్కలను ఇప్పటి వరకూ నాటారాని అన్నారు. తెలంగాణలోని అన్ని పల్లెలు ,పట్టణాలు పచ్చదనాన్ని సంతరించుకున్నాయని తెలిపారు.
స్థానిక ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతూ చొప్పదండి నియోజకవర్గ బిడ్డగా ఎంపి సంతోష్ కుమార్ ..ఈ నియోజకవర్గ పరిధిలోని కొండగట్టు ఆధ్యాత్మిక క్షేత్రాన్ని దత్తత తీసుకొని అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం గొప్ప విషయమని అన్నారు. ఎంపీ సంతోష్ కుమార్ కు ప్రజల తరపున కృతజ్ఞతలు
తెలిపారు.అంతకుముందు కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారిని ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ రావు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ రవీందర్ సింగ్, జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత, ఎమ్మెల్యేలు సుంకే రవిశంకర్, సంజయ్ కుమార్ లతో కలిసి దర్శించుకునీ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వాచ్ టవర్ ఎక్కి…విత్తన బంతులు విసిరి….కొండగట్టు రిజర్వ్ ఫారెస్ట్ లో మొక్కలు నాటిన అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త రాజ్యసభ పార్లమెంటు సభ్యులు సంతోష్ కుమార్… కొండగట్టు రిజర్వ్ ఫారెస్ట్ లోని వాష్ టవర్ పైకి ఎక్కి అటవీ అందాలను వీక్షించారు సుమారు అరగంటకు వాచ్ టవర్ పైనే గడిపారు. ప్రకృతి ప్రేమికుడు ప్రకృతి ప్రకాష్ సీతాఫల విత్తనాలతో తయారుచేసిన అటవీ బంతులను విసిరారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతి కుమారి, సిఎం కార్యదర్శి భూపాల్ రెడ్డి, హరిత హారం ప్రత్యేక అధికారి ప్రియాంక వర్గీస్, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా లు పాల్గొన్నారు.