Medaram vanadevathalu CM, governor : కొనసాగుతోన్న వనదేవతల దర్శనాలు
--మేడారం లో ఇసుకరాలని భక్త జనసందోహం --జాతరలో కొందరు భక్తులకు తీవ్ర అస్వస్థత --అమ్మవార్లను దర్శించుకున్న గవర్నర్ తమిళసై, సీఎం రేవంత్ రెడ్డి
కొనసాగుతోన్న వనదేవతల దర్శనాలు
–మేడారం లో ఇసుకరాలని భక్త జనసందోహం
–జాతరలో కొందరు భక్తులకు తీవ్ర అస్వస్థత
–అమ్మవార్లను దర్శించుకున్న గవర్నర్ తమిళసై, సీఎం రేవంత్ రెడ్డి
ప్రజా దీవెన/ మేడారం: మేడారం మహాజాతరకు రాష్ట్ర గవర్నర్ త మిళిసై మే సౌందర రాజన్, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవం త్ రెడ్డి లు వచ్చి మేడారం జాతరలో వనదేవతలను దర్శించుకున్నా రు. అయితే గవర్నర్ ముఖ్యమంత్రి వేర్వేరు సమయాల్లో ఉన్నదేవ తలను దర్శించుకున్నారు.
అంతకుముందు గవర్నర్ కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండాతో కలిసి గద్దెలపై కొలువై ఉన్న అమ్మవార్లను దర్శించుకు న్నారు. సమ్మ క్క, సారక్క, పగిడిద్దరాజు, గోవిందరాజులను దర్శిం చుకుని మొక్కులు తీర్చుకున్నారు. గద్దెల వద్దకు చేరుకున్న గవర్నర్ వనదేవతలకు పట్టు వస్త్రాలు, నిలువెత్తు బంగారం సమర్పించి మొ క్కులు తీర్చకున్నారు.
మేడారం మహాజాతరకు చేరుకున్న గవర్నర్ ఆ తర్వాత హాజరైన సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క, బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ప్రత్యేక అధికారులు కృష్ణ ఆదిత్య, ఆర్.వి. కర్జన్, శరత్ జిల్లా ఎస్పీ శబరిష్, ఇతర ఉన్నత పోలీస్ అధికారులు పూజారులు స్వాగతం పలికారు.
అనంతరం జరిగిన మీడియా సమావేశంలో గవర్నర్ మాట్లాడుతూ మేడారం గొప్ప జాతర అని అన్నారు. దేశ, రాష్ట్ర ప్రజలు సుఖసం తోషాలతో ఉండాలని సమ్మక్క సారలమ్మ ను కోరుకున్నానని తెలి పారు. లక్షల కొద్దీ ప్రజలు తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకుంటు న్నారని చెప్పారు. అమ్మవార్ల ను దర్శించుకోవడం ఇది మూడోసారి అని, వారిని దర్శించుకోవడం తన అదృష్టమన్నారు. ఆరు గిరిజన గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
సమ్మక్క సారక్క జాతరలో వనదేవతలను దర్శించుకున్న అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మన దేవతలను వేడుకున్నానని పేర్కొన్నారు. ములుగు జిల్లాతో, మంత్రి సీతక్కతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు. తన రాజకీయ ప్రస్థానంలో ముఖ్యమైన కార్యక్రమాలు అన్ని ములుగు నించే ప్రారంభించామని గుర్తు చేశారు.
మేడారం జాతర ఏర్పాట్లకు ప్రభుత్వం నుంచి రూ. 110 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. పాలకులు ప్రజలను పీడించినప్పుడే ఎవరో ఒకరు వారికి ఎదురోడ్డి నిలబడతారని అన్నారు. సమ్మక్క సారక్క జాతరను జాతీయ పండుగ ప్రకటించడం సాధ్యం కాదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పినట్లుగా విన్నానని, అలా అయితే కేంద్రం కుంభమేళాను జాతీయ పండుగ నిర్వహిస్తుంది కదా అని ప్రశ్నించారు.
గతంలో కుంభమేళాకు కేంద్రం వందల కోట్లు విడుదల చేసింది అని గుర్తు చేశారు. ఇదిలా ఉండగా నిన్న అమ్మవారు సమ్మక్క తల్లిని గద్దెకు తీసుకొచ్చే క్రమంలో ఆఫీసర్లు గద్దెల దర్శనాన్ని అరగంట పాటు ఆపేశారు. సమ్మక్క ను గద్దెలపై ప్రతిష్టించిన అనంతరం దర్శనానికి అనుమతించారు. అయితే ఆ సమయంలో క్యూలైన్లలో అమ్మవారి దర్శనం కోసం భారీగా నిలబడ్డారు.
దీంతో అక్కడ భక్తులు ఒకరినొకరు ముందుకు తోసుకురావడంతో వారి మధ్య బాగా ఒత్తిడి జరిగి ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడ్డారు. ఉదయం నుంచి గంటల తరబడి లైన్లో నిల్చోవడం, ఎండవేడిమి, ఉపవాసంతో లైన్లో నిల్చున్న నలుగురు మహిళలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఒక యువతి, ఒకరు శివసత్రి కాగా మరో ఇద్దరు మహిళా భక్తులు. వీరిని అత్యవసర చికిత్సకోసం మేడారంలోని 50 పడకల ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వీరిని అంబులెన్స్ లో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి పంపించారు.