Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mega family ramcharan Upasana : క్లింకార చెల్లెళ్లను పరిచయం చేసిన ఉపాసన

--ముద్దుల కుమార్తెతో ఆడుకుంటూ మురిసిపోతున్నారు

 

క్లింకార చెల్లెళ్లను పరిచయం చేసిన ఉపాసన

-ముద్దుల కుమార్తెతో ఆడుకుంటూ మురిసిపోతున్నారు

ప్రజా దీవెన/హైదరాబాద్: రామ్ చరణ్-ఉపాసన దంపతులు ఎంత అన్యోన్యంగా ఉంటారో తెలియనిది కాదు. ఇక వారికి కుమార్తె క్లింకా రా పుట్టిన తర్వాత వారి జీవితం మరింత సంతోషంగా మారింది. ఇక రామ్ చరణ్  (ramcharan)  అయితే తన షూటింగ్స్ పక్కన పెట్టి క్లింకారాతో ఎక్కువ సమయం గడుపుతున్నాడు. తన ముద్దుల కుమార్తెతో ఆడుకుంటూ మురిసి పోతున్నాడు.

ఇక ఉపాసన (upasana)  విజయవంతమైన వ్యాపారవేత్తలలో ఒకరిగా పరిగ ణించబడుతుంది. ఆమె అపోలో హాస్పిటల్స్ వైస్ ప్రెసిడెంట్. ఇది కాకుండా, ఆమె హీరో రామ్‌చరణ్‌కి భార్య. ప్రస్తుతం వారి కుమార్తె క్లిన్‌కారాకు మమ్మీ. ఇలా ఎన్నో బాధ్యతలను ఆమె సమర్థవంతంగా నిర్వహిస్తోంది. తమ కుటుంబానికి సంబంధించిన విషయాలను ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది.

తాజాగా తన కుమార్తెకు ఇద్దరు చెల్లెళ్లు పుట్టారని పేర్కొంది. వారికి సంబంధించిన ఆసక్తికర ఫొటోలను షేర్ చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌‌లో ఉపాసన తన భర్త రామ్ చరణ్, వారి కుమార్తె క్లిన్ కారాతో కలిసి ఉన్న కుటుంబ చిత్రాన్ని పోస్ట్ చేసింది. ఈ చిత్రంలో ఉపాసన సోదరి, అనుష్పాల కామినేని – ఆమె భర్త అర్మాన్ ఇబ్రహీం, వారి కుమార్తెలు కూడా ఉన్నారు.

ఐరా పుష్పా ఇబ్రహీం, రికా సుచరిత ఇబ్రహీం అని కవల కుమార్తెల కు పేర్లను వారు పెట్టారు. వారి పేర్లను అందరికీ వెల్లడిస్తూ వారితో దిగిన ఫొటోలను ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన కుమార్తెకు ఇద్దరు చెల్లెళ్లు వచ్చేశారని సంతోషంగా తెలిపింది. ఆ చిత్రాల్లో క్లిన్ కారా పింక్ టూల్ ఫ్రాక్ ధరించి, రామ్ చరణ్ చేతుల్లో ఆడుకుంటూ కనిపించింది.

మరోవైపు, అనుష్పాల కుమార్తెలు ఆకుపచ్చ రంగు టాప్స్‌తో జత చేసిన పింక్ లెహంగాల్లో క్యూట్‌గా కనిపించారు. అయితే, వారిద్దరూ ఆడపిల్లల ముఖం చూపించలేదు. అనుష్పాల కామినేని డిసెంబర్ 8, 2021న అంగరంగ వైభవంగా కార్ రేసర్ అర్మాన్ ఇబ్రహీంతో పెళ్లి చేసుకున్నారు. వారికి తాజాగా కవల ఆడపిల్లలు పుట్టారు. ఇది లా ఉండగా క్లిన్ కారా కూడా ప్రతి ఇతర ఆడపిల్లలాగే నాన్నకు యు వరాణి.

ఓ ఇంటర్వ్యూలో తన తండ్రిని చూసినప్పుడల్లా క్లిన్ కారా ముఖం ఎలా మెరుస్తుందో ఉపాసన పేర్కొంది. అయితే, ఇది జరిగినప్పుడ ల్లా తాను తండ్రి-కుమార్తె బంధం చూసి ఈర్ష్యగా ఉందని అంగీకరిం చింది. దీంతో మెగా కుటుంబాన్ని అభిమా నించే వాళ్లు ఈ మాటలు విని సంతోష పడుతున్నారు.ఇక వారి కుమార్తె క్లింకారాకు సంబంధిం చిన ప్రతి విషయం గురించి ఆసక్తిగా తెలుసుకుంటున్నారు.