More support for Ram Mandir: రామమందిరానికి మరింత మద్దతు
--హను-మాన్ మూవీ మేకర్స్ అదిరిపోయే నిర్ణయం --ప్రతి సినిమా టికెట్‌లోని రూ.5 మందిరానికే బహుమానం
రామమందిరానికి మరింత మద్దతు
–హను-మాన్ మూవీ మేకర్స్ అదిరిపోయే నిర్ణయం
–ప్రతి సినిమా టికెట్‌లోని రూ.5 మందిరానికే బహుమానం
ప్రజా దీవెన/ హైదరాబాద్: ప్రపంచమే అబ్బురపడేలా అయోధ్యలో అంగరంగ వైభవంగా సిద్ధమవుతున్న రామ మందిరానికి దేశవ్యాప్తంగా ఊహించిన దానికంటే రెట్టింపు స్థాయిలో మద్దతు లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రామ మందిరం నిర్మాణం అదే సందర్భంలో ఈ నెల 22న ప్రారంభోత్సవం క్రమంలో సినిమా రంగం నుంచి కూడా ఊహించని విధంగా మద్దతు లభించింది.
సాక్షాత్తు హనుమాన్ సినిమా బృందం సంచలన ప్రకటన చేసింది. హనుమాన్ సినిమాకు అమ్ముడుపోయే ప్రతి టికెట్టులో ఐదు రూపా యలు రామమందిరం ట్రస్ట్ కు కేటాయించనున్నట్లు ప్రకటిం చారు. ఇదిలా ఉండగా తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో రూపొం దిన హను- మాన్ మూవీ జనవరి 12న రిలీజ్ కానుంది.
కె.నిరంజన్ రెడ్డి ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్‌గా ముగి సింది. ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి అతిథిగా హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో తాను మాట్లాడుతూ అయోధ్య రామ మందిర నిర్మాణం చరిత్రలో ఒక కీలకమైలు రాయిగా నిలిచిపోతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ ఆలయ ప్రారంభోత్సవానికి తనను పిలవడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. జనవరి 22న ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి రామమందిర ప్రారంభోత్సవాన్ని చూసేందుకు వెళ్తానని వెల్లడించారు. ఇదే సందర్భంగా మూవీ మేకర్స్ తీసుకున్న ఒక అదిరిపోయే నిర్ణ యం గురించి కూడా చిరంజీవి బయట పెట్టారు.
అమ్ముడు పోయిన ప్రతి ‘హను-మాన్’ టికెట్‌లోని నుంచి రూ.5 అయోధ్య రామమంది రానికి బహుమతిగా ఇవ్వాలని నిర్మాత ప్రకటించినట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయం నిజంగా హర్షణీయం అని కొనియాడారు. తన అమ్మానాన్నలు ఆంజనేయుడిని ఎంతో అమితంగా ఆరాధిస్తారని, తనకు కూడా హనుమంతుడంటే ఎంతో ఇష్టమని, అందుకే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చానని చిరంజీవి చెప్పుకొచ్చారు.
అలానే తన ముందు డైపర్లు వేసుకునే స్థాయి నుంచి డయాస్ ఎక్కి మాట్లాడే స్థాయికి వచ్చిన తేజ ఈ సినిమాకి హీరో కావడం వల్ల అతడికి సపోర్టుగా తాను వచ్చానని పేర్కొన్నారు. దర్శకుడు ప్రశాంత్‌వర్మ అంటే కూడా తనకు ఎంతో అభిమానం అని పేర్కొన్నారు. హనుమ అనేది ఒక ఇన్‌స్పైరింగ్ పర్సనాలిటీ అని, థియేటర్లు తక్కువగా లభించినా బాధపడాల్సిన అవసరం లేదని మేకర్స్‌లో ధైర్యం నింపారు.
సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడం చాలా రిస్క్ తో కూడుకున్నదని కానీ కంటెంట్ బాగుంటే సక్సెస్ ను ఎవరూ ఆపలేరు అని కూడా కామెంట్లు చేశారు. ఇదే ఈవెంట్‌లో తేజ సజ్జా కూడా మాట్లాడుతూ చిరంజీవిని పొగిడాడు. చిరంజీవి తన జీవితంలో లేకపోతే తాను కెరీర్ లో ఆ స్థాయికి వచ్చే వాడిని కాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
హీరోగా తనకొక హిట్ అందించిన ప్రశాంత్‌వర్మ హను-మాన్ సినిమాతో సూపర్‌హీరోగా మార్చేశాడని అతడికి తన కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ప్రస్తుతం ఈ నటుల మాటలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.