Golconda Bonalu 2025 :ప్రజా దీవెన, హైదరాబాద్: భాగ్య నగరంలో నిర్వహించే బోనాల సం బరాల షెడ్యూల్‌ను దేవాదాయ శాఖ అధికారులు విడుదల చేశా రు. చారిత్రక గోల్కొండ బోనాలతో పాటు పాతబస్తీ లాల్‌దర్వాజా బో నాలు, సికింద్రాబాద్ బోనాల తేదీ లను కూడా ప్రకటించారు. మరో రెండు నెలల్లో ఈ బోనాల సంబ రా లు మొదలు కానున్నాయి.
తెలంగాణ ప్రజలు ఎంతో ప్రతిష్ఠా త్మకంగా జరుపుకునే పండుగల్లో బోనాలు ఒకటని అందరికీ తెలి సిందే. రాష్ట్ర పండుగ అయిన బో నాల పండుగ తేదీలను పరిశీలిస్తే.. చారిత్రక గోల్కొండ కోట శ్రీజగదాం బిక అమ్మవారి బోనాలు జూన్ 26 వ తేదీన ప్రారంభమై జూలై 24వ తేదీతో ముగుస్తాయి. ఇక సికిం ద్రా బాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మ వారి బోనాలు జూలై 13న, లాల్‌ద ర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు జూలై 20న జరగను న్నాయి.
గతేడాది గోల్కొండ బోనాలలో 25 లక్షల మంది భక్తులు పాల్గొనగా, ఈసారి ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భా విస్తున్నారు.
బోనాల నిర్వహణ షెడ్యూల్ ఇలా… జూన్ 26వ తేదీ గురు వారం మొదటి బోనం, 29వ తేదీ ఆదివారం రెండవ బోనం, జూలై 3వ తేదీ గురువారం మూడవ బో నం, 6వ తేదీ ఆదివారం నాల్గవ బో నం, 10వ తేదీ గురువారం ఐదవ బోనం, 13వ తేదీ ఆదివారం ఆరవ బోనం, 17వ తేదీ గురువారం ఏడ వ బోనం, 20వ తేదీ ఆదివారం 8వ బోనం, 24వ తేదీ గురువారం 9వ బోనం నిర్వహించనున్నారు.