వచ్చే రెండు నెలల్లో మస్తు సెలవులు
— జూలై, ఆగస్టుల్లో విద్యార్థులకు కొరుకున్నంత విశ్రాంతి
ప్రజా దీవెన/హైదారాబాద్: మొన్నటికి మొన్న వేసవి సెలవులు ముగుసి కొత్త తరగతుల పుస్తకాలతో కుస్తీ పడుతున్న విద్యార్థులకు కొంత ఊరట లభించినుంది. గత నెలలో పాఠశాలలు, ఇంటర్ కాలేజీలు ప్రారంభమై ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ కోర్సుల అడ్మిషన్ ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమం లోనే జులై, ఆగస్టు నెలల్లో రెండు నెలల్లో స్కూళ్లకు భారీగా సెలవులు రాబోతున్నాయి. కొత్త విద్యా సంవత్సరంలో ఇప్పటికే విద్యార్థులు పూర్తి స్థాయిలో చదువుల్లో నిమగ్నమై పుస్తకాలతో కుస్తీ పడుతున్న నేపద్యంలో ఆసరమైన విశ్రాంతి దొరకనుంది.
ఈ సందర్భంలో జులై, ఆగస్టు నెలల్లో పాఠశాలలకు ఎప్పుడెప్పుడు సెలవులు వస్తున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
*తొలుత జులై నెల సెలవులు ఇలా:* జూలై 8వ తేదీ శనివారంనెలలో రెండవ శనివారం, జులై 9 ఆదివారం కాబట్టి ఈ రెండు రోజులు పాఠశాలలకు సహజంగా సెలవులు. జులై 16 వ తేదీ ఆదివారం, జులై 22 న నాలుగవ శనివారం చాలా స్కూళ్లకు సెలవులు ఇస్తున్నారు. జులై 23వ తేదీ ఆదివారం క్లాసులు ఉండవు. జులై 28న మొహర్రం కాబట్టి కొన్ని పాఠశాలలకు సెలవు ఉండవచ్చు. జులై 29 శనివారం కూడా మొహర్రం జరుపుకుంటారు, దీంతో కొన్ని పాఠశాలలకు సెలవు ఉండవచ్చు. జులై 30 ఆదివారం పాఠశాలకు హాలిడే. జులై 31నెల చివరి రోజు కాబట్టి కొన్ని పాఠశాలలకు సెలవు ఉండవచ్చు.అయితే వేర్వేరు పాఠశాలలు వేర్వేరు హాలిడే షెడ్యూల్స్ కలిగి ఉంటాయి. ఇలా కొన్ని సంస్థలకు ప్రతి వారం రెండు రోజులు సెలవులు ఉంటాయి. తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగకు స్టేట్ హాలిడే సైతం ఇస్తోంది. జులైలో కచ్చితమైన సెలవుల గురించి తెలుసుకోవడానికి విద్యార్థులు, తల్లిదండ్రులు సంబంధిత స్కూల్ హాలిడే షెడ్యూల్‌ను చెక్ చేయవచ్చు.
*ఆగస్టు సెలవులు* :ఆగస్టు 5, శనివారం, కొన్ని పాఠశాలలకు సెలవు ఉండవచ్చు. ఆగస్టు 6, ఆదివారం కాబట్టి స్కూల్‌కి హాలిడే. ఆగస్టు 12 నెలలో రెండవ శనివారం, ఆగస్టు 13 ఆదివారం రెండు వరుస సెలవులు కాగా ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం పాఠశాలలకు సెలవు అయితే ఆగస్టు 16 పార్సీ న్యూ ఇయర్ కొన్ని పాఠశాలలకు సెలవు ఉండవచ్చు. ఆగస్టు 20 ఆదివారం హాలిడే కాగా ఆగస్టు 27 ఆదివారం. ఆగస్టు 29 ఓనం తో కొన్ని పాఠశాలలకు సెలవు ఉండవచ్చు. ఆగస్టు 30 రక్షా బంధన్ కావడంతో పాఠశాలలకు సెలవు ఇస్తారు. అయితే విద్యార్థులు నివసిస్తున్న రాష్ట్రం లేదా ప్రాంతం, పాఠశాలను బట్టి పైన పేర్కొన్న కొన్ని సెలవులు ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చన్నది పరిశీలకుల అభిప్రాయం.