The latest buzz in WhatsApp: వాట్సప్ లో సరికొత్త సందడి
-- షాపింగ్ తో పాటు పేమెట్లు మరింత సులభతరంకై అందుబాటు లోకి 'ఫ్లో' అనే కొత్త ఫీచర్ --అతిత్వరలోనే వాట్సాప్ యూజర్లకి అందుబాటులోకి రానున్న ఆప్షన్లు
వాట్సప్ లో సరికొత్త సందడి
— షాపింగ్ తో పాటు పేమెట్లు మరింత సులభతరంకై అందుబాటు లోకి ‘ఫ్లో’ అనే కొత్త ఫీచర్
–అతిత్వరలోనే వాట్సాప్ యూజర్లకి అందుబాటులోకి రానున్న ఆప్షన్లు
ప్రజా దీవెన / క్యాలిఫార్నియా: ప్రముఖ మెసెంజర్ యాప్ వాట్సాప్ ప్రపంచంలో సరికొత్త ప్రయోగాలతో దూసుకెళ్తున్న విషయం ( WhatsApp is a thing that is rushing in the world with new experiments) తెలిసిందే. ఇటీవల పలు సరికొత్త ఫీచర్లని అందుబాటులోకి తీసుకొచ్చి అన్ని విధాలా ఆకట్టుకుంటూ దినదనాభివృద్ధి చెందుతున్న వాట్సప్ సరికొత్త సందడి చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన కసరత్తు ప్రారంభించింది.
ఛానెల్స్ ఫీచర్‌తో పాటు నచ్చిన ప్రముఖులను, సంస్థలను అనుసరిస్తూ అప్డేట్స్ తెలుసుకునే అవకాశాన్ని కల్పించింది. అయితే ఇప్పుడు మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది వాట్సాప్. దీని ద్వారా మెసేజ్ పంపినంత సులభంగా ఆన్లైన్ ఆర్డర్లు, పేమెంట్లు (Online orders and payments as easy as sending a message) చేసుకోవచ్చుని, తమ కస్టమర్లు కోసం షాపింగ్ అనుభవాన్ని మరింత సులభతరం చేసేందుకు ‘ఫ్లో’ అనే కొత్త ఫీచర్‌ను తీసుకురానున్నట్లు ప్రకటించింది.
దీని ద్వారా వ్యాపారులతో పాటుగా వినియోగదారులు మల్టీ సర్వీసులని ఒకే చోట పొందనున్నారు. రాబోయే రోజుల్లో బిజినెస్ అకౌంట్ యూజర్ల కోసం అనేక కొత్త ఆప్షన్లు యాడ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త ‘ఫ్లో’ ఫీచర్ ద్వారా వాట్సాప్ యాప్ నుంచి షాపింగ్ (Shop from the WhatsApp app through the new ‘Flow’ feature), ఫుడ్ ఆర్డర్, అపాయిట్‌మెంట్ బుకింగ్ వంటి సేవలన్నో సులభంగా చేసుకోవచ్చు.
బిజినెస్ అకౌంట్ల కోసం నిర్దిష్ట క్యాలెండర్లతో పాటుగా మరెన్నో ఆప్షన్లు రానున్నాయి. వాట్సాప్ Flow ఫీచర్ కోసం సపోర్ట్ పేజ్ ని క్రియేట్ (Create support page for WhatsApp Flow feature) చేయగా అపాయిట్మెంట్, ఫారమ్ ఫిల్లింగ్, ప్రాడక్ట్ కస్టమైజేషన్ లాంటి ఆప్షన్స్ ఎన్నో ఉన్నాయి. అతి త్వరలో వాట్సాప్ యూజర్లకి ఈ ఆప్షన్లన్నీ అందుబాటులోకి రానున్నాయి.
ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చాక ఇక పేమెంట్స్ కూడా ఇందులోనే చేసే వెసులుబాటు కూడా ఉంటుంది అని వాట్సాప్ ప్రతినిధులు చెబుతున్నారు. వాట్సాప్ యూజర్లకు షాపింగ్, ఫుడ్ ఆర్డర్, టికెట్ బుకింగ్‌తో పాటు ఈ-మెసేజింగ్ యాప్ ఫెసిలిటీ ఆప్షన్లన్నీ అతి త్వరలో అందుబాటులోకి ( All facility options of the e-messaging app will be available very soon) రానున్నాయని తెలుస్తోంది.
ఫ్లో ఫీచర్ అందుబాటులోకి వస్తే థర్డ్ పార్టీ యాప్‌లతో అవసరం లేకుండా పోతుంది. ఇప్పటికే మన దేశంలోని అనేక వ్యాపార సంస్థలతో ఈ ఫ్లో ఫీచర్‌ను వాట్సాప్ టెస్ట్ చేసింది. రెడ్ బస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు పలు ఈ-కామర్స్ యాప్స్‌లో పొందే ఆప్షన్లన్నీ ఇక మీదట వాట్సాప్‌లోనే అందుబాటులో ఉంటాయని( All the options available in e-commerce apps will now be available in WhatsApp) ఆ సంస్థ స్పష్టం చేసింది.
ఇకపోతే వాట్సాప్ పేమెంట్స్ కోసం Razorpay, PayUతో ఒప్పందం (Razorpay ties up with PayU for WhatsApp payments) కుదుర్చుకుంది. వీటి ద్వారా యూజర్లు క్షణాల్లో లావాదేవీలను పూర్తి చేయోచ్చు. ఇప్పటివరకు UPI ద్వారా చెల్లింపులు చేయడానికి యూజర్లు వాట్సాప్ పేని ఉపయోగించేవారు.
అయితే ఇక నుంచి ఇతర UPI యాప్‌లు, క్రెడిట్, డెబిట్ కార్డుల నుంచి కూడా చెల్లింపులు సులభంగా చేయోచ్చని ప్రకటించారు. వాట్సాప్ యాప్‌ని ఒక్క భారతదేశంలోనే సుమారు 50 కోట్ల మంది వాడుతున్నారు. వీరందరు కూడా వాట్సాప్ పేమెంట్స్ ని వాడేలా ప్రయత్నాలు చేస్తున్నారు.