The second phase is to examine the distribution of sheep రెండో విడత గొర్రెల పంపిణీ పరిశీలన
-- నాంపల్లి మండలంలో పర్యటించిన దూదిమెట్ల
రెండో విడత గొర్రెల పంపిణీ పరిశీలన
— నాంపల్లి మండలంలో పర్యటించిన దూదిమెట్ల
ప్రజా దీవెన/ నాంపల్లి: రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర షీప్స్ & గోట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మెన్
దూదిమెట్ల బాలరాజు యాదవ్ పరిశీలించారు. నాంపల్లి మండలం లింగోటం, కేతేపల్లి, బండతిమ్మాపురం, ముష్టి పల్లి, సుంకిశాల గ్రామాల్లో క్షేత్ర స్థాయి లో అధికారులతో కలిసి పరిశీలిoచారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నాయకత్వoలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మార్గదర్శకతో జరుగుతున్న రెండో విడుత గొర్రెల పంపిణీ ని సంబంధిత అధికారులతో పరిశీలించడం జరిగిందన్నారు.
తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకం ఈ పథకాన్ని యాదవ కురుమలు ప్రతి ఒక్కరు వినియోగించు కోవాలని కోరారు. పలక అమలులో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సదరు అధికారులపై తగిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ప్రభుత్వం నుండి వచ్చే పథకాలను ప్రజలు సద్వినియోగపరచు కోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ వైధ్యాధికారి డా.యాదగిరి, డా.విశ్వేశ్వర రావు, డా.నాగయ్య, పంగరామ్ మెహన్ యాదవ్, కొండల్ యాదవ్, బెల్లి సత్తయ్య, మాజీ సర్పంచ్ రాజమల్లు యాదవ్, నూనే వెంకటేష్ యాదవ్ ఇతర యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు.