Sardar Sarvai Papanna Goud :ప్రజా దీవెన, కట్టంగూర్: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవిత చరి త్రపై సినిమాను రూపొందిస్తున్నట్లు ఆ మూవీ ఆర్గనైజర్ బాలసాని హ రీష్ గౌడ్ వెల్లడించారు. ఈమేరకు ఆదివారం వారు కట్టంగూరు మండ ల కేంద్రంలో ఇటీవల ఏర్పాటు చేసి న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వి గ్రహాన్ని పరిశీలించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ బహుజన వీరుడు సర్వాయి సర్ధార్ పాపన్న గౌడ్ 361 ఏళ్ల క్రితమే గోల్కొండ కోటపై జెండాను ఎగురవేశారన్నా రు.
రాచరికపు వ్యవస్థ నీడలో జ మీం దార్లు, జాగీర్దాల అరాచకాలను సహించలేక కడుపుమండి కత్తి ప ట్టిన వీరుడు పాపన్నగౌడ్ అని, దళి త, బహుజనులు ఏకమై పోరాడితే నే రాజ్యాధికారం సాధించవచ్చని నిరూపించిన సామాన్యుడన్నారు. పూర్వపు వరంగల్ జిల్లా రఘునా థపల్లి మండం ఖిలాషాపూర్‌ను కేం ద్రంగా చేసుకొని మొఘలుల ఆధిప త్యాన్ని ఎదిరించి గోల్కొండ కోటపై జెండా ఎగురవేసిన బహుజన వీరు డు సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ అన్నారు.
సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అంతర్జాతీయ ఖ్యాతి గాంచారని, ఆయన ప్రజల కోసం చేసిన పోరా టాలు, చేపట్టిన నిర్మాణాలు, జా తిని జాగృతం చేసిన విధానంపై ఈ సినిమాను రూపొందించనున్నట్టు వెల్లడించారు. ఈ చిత్రాన్ని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కల్చరల్ అండ్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూపొందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉయ్యాల అభిరామ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్యాలెండర్ ఆవిష్కరిం చారు.