ఉజ్జయిని మహంకాళిబోనాల జాతర షురూ
— హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు
ప్రజా దీవెన/హైదరబాద్: హైదరబాద్ లో బోనాల జాతర ఆరంభమైంది. ఆదివారం నుంచి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ఘనంగా జరగనున్నాయి. ఈ క్రమoలో జాతర సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు అమలుపరుస్తున్నారు.
సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆది, సోమవారాల్లో ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని అధికారులు వెల్లడిస్తున్నారు. బోనాల పండుగ సందర్భంగా వచ్చే భక్తులతో ఆలయ సమీపంలో రద్దీ ఎక్కువగా ఉంటుందని ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాలను దారి మళ్లించనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు ప్రయాణం చేసేవారు త్వరగా ఇంట్లో నుంచి బయలుదేరాలని సూచించారు.
అదేవిధంగా ప్లాట్ ఫామ్ నంబర్.1 నుంచి వెళ్లే వారు రద్దీ ఎక్కువ ఉండడంతో చిలకలగూడ వైపు నుంచి వచ్చి ప్లాట్ ఫామ్ నంబర్.10ని ఉపయోగించుకోవాలని తెలిపారు. ఆలయానికి రెండు కిలోమీటర్ల పరిధిలో ట్రాఫిక్ రద్దీ ఉంటుందన్నారు. అందుకు ప్రజలు సహకరించాలని కోరారు.
*ట్రాఫిక్ ఆంక్షలు ఇలా…..* దారి మళ్లింపు ఈ ప్రాంతాలలో
కర్బాల మైదాన్ నుంచి వచ్చే సాధారణ ట్రాఫిక్, ఆర్టీసీ బస్సులను రాణిగంజ్ ఎక్స్ రోడ్డులో మినిస్టర్ రోడ్డు వైపు దారి మళ్లిస్తారు.
రైల్వే స్టేషన్ నుంచి ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు చిలకలగూడ క్రాస్‌రోడ్స్, గాంధీ హాస్పిటల్, ముషీరాబాద్ క్రాస్ రోడ్, కవాడిగూడ, మ్యారెట్ హోటల్ ట్యాంక్‌బండ్ రూట్లో వెళ్లాలి.
తాడ్బన్ వైపు వెళ్లే బస్సులు క్లాక్‌టవర్, ప్యాట్నీ ఎక్స్ రోడ్డు, వైఎంసీఏ, ఎస్బీహెచ్ ఎక్స్ రోడ్స్ మీదుగా వెళ్లాలి.
*ఘాస్మండి క్రాస్ రోడ్స్:* బైబుల్ హౌస్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, తిరుమలగిరి వైపు వెళ్లే సాధారణ ట్రాఫిక్ ఘాస్మండి ఎక్స్ రోడ్స్ నుంచి సజ్జనాల్ స్ట్రీట్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, హిల్ స్ట్రీట్, రాణిగంజ్ వైపు వెళ్లాలి.
*ప్యాట్నీ ఎక్స్ రోడ్స్ :* ఎస్బీహెచ్ చౌరస్తా నుంచి ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే వాహనాలను ప్యాట్నీ ఎక్స్ రోడ్స్‌లో ప్యారడైజ్, మినిస్టర్ రోడ్డు లేదా క్లాక్ టవర్, సంగీత్ క్రాస్‌రోడ్స్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, చిలకలగూడ, ముషీరాబాద్, కవాడిగూడ, మ్యారెట్ హోటల్, ట్యాంక్‌బండ్ వైపు వెళ్లాలి.
*ప్యారడైజ్ ఎక్స్ రోడ్స్:* సీటీఓ జంక్షన్ నుంచి ఎంజీ రోడ్డు వైపు వెళ్లే వాహనాలను ప్యారడైజ్ ఎక్స్ రోడ్డులో సింధికాలనీ, మినిస్టర్ రోడ్డు, రాణిగంజ్, కర్బాల మైదాన్ మళ్లిస్తారు, ప్యాట్నీ క్రాస్ రోడ్డు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను ప్యారడైజ్ ఎక్స్ రోడ్స్ వద్ద సీటీఓ జంక్షన్ వైపు మళ్లిస్తారు.పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు పంజాగుట్ట, ఖైరతాబాద్ జంక్షన్, ఐమ్యాక్స్ రోటరీ, తెలుగుతల్లి ఫ్లైఓవర్, లోయర్ ట్యాంక్‌బండ్, ఆర్టీసీ ఎక్స్ రోడ్డు, ముషీరాబాద్ ఎక్స్ రోడ్డు, గాంధీ హాస్పిటల్, చిలకలగూడ క్రాస్ రోడ్డు, ప్లాట్ ఫామ్ నంబర్ 10కు రాకపోకలు సాగించాలి.సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఓల్డ్ గాంధీ ఎక్స్ రోడ్స్, మోండా మార్కెట్, ఘాస్మండి, బైబిల్ హౌస్, కర్బాల మైదాన్, ట్యాంక్‌బండ్ రూట్లలో రాకపోకలు సాగించాలి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్యాట్నీ, ప్యారడైజ్, బేగంపేట్, పంజాగుట్ట రూట్లల్లో వెళ్లరాదు. ఆ రూట్లలో భారీగా రద్దీ ఉంటుంది.
ఉప్పల్ నుంచి పంజాగుట్ట వైపు రాకపోకలు సాగించే వారు ఉప్పల్, రామంతాపూర్, అంబర్పేట్, హిమాయత్‌నగర్, ఖైరతాబాద్ జంక్షన్, పంజాగుట్ట రూట్లను ఉపయోగించాలి. అయితే ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్ రూట్లల్లో భారీగా ట్రాఫిక్ ఉంటుంది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, సెయింట్ మేరీ రూట్ మార్గాలను మూసేస్తారు.సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి హకీంపేట, బోయిన్పల్లి, బాలానగర్, అమీర్‌పేట వెళ్లే వాహనాలు క్లాక్ టవర్ నుంచి వయా ప్యాట్నీ, ఎస్బీహెచ్ వైపు నుంచి వెళ్లాలి.