Vote must be exercised: ఓటు విధిగా వినియోగించుకోవాలి
--ప్రతి భారత పౌరుడు ప్రధమ కర్తవ్యoగా భావించాలి --వచ్చే ఎన్నికల్లో యువత క్రియాశీల పాత్ర పోషించాలి -- కామినేని మెడికల్ కళాశాల విద్యార్థిని, విద్యార్థులకు అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ కర్ణన్
ఓటు విధిగా వినియోగించుకోవాలి
–ప్రతి భారత పౌరుడు ప్రధమ కర్తవ్యoగా భావించాలి
–వచ్చే ఎన్నికల్లో యువత క్రియాశీల పాత్ర పోషించాలి
— కామినేని మెడికల్ కళాశాల విద్యార్థిని, విద్యార్థులకు అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ కర్ణన్
ప్రజా దీవెన/ నల్లగొండ: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతి భారత పౌరుని ప్రధమ కర్తవ్యమని అని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు. గురువారం నాడు నార్కట్ పల్లిలోని కామినేని మెడికల్ కళాశాల విద్యార్థిని, విద్యార్థులకు స్వీప్ (Systematic Voters Education and Electoral Participation) కార్యక్రమం పై అవగాహన కలిగించారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
యువత వచ్చే ఎన్నికలలో క్రియాశీల పాత్ర పోషించాలన్నారు ( The youth should play an active role in the upcoming elections). ప్రజల ప్రయోజనం, మన ప్రాంత అభివృద్ధి, సమాజానికి మంచి చేసే నాయకులని ఓటు హక్కు ద్వారా ఎన్నుకోవచ్చు అన్నారు. ఒక వేల పోటీ చేసే అభ్యర్థులు నచ్చనట్లయితే నోటా ను ఉపయోగించవచ్చు అని తెలిపారు. ఎన్నికలు పారదర్శకంగా ఈవిఎం మిషన్ల ద్వారా చేపడుతున్నట్లు తెలిపారు.
మీరు వేసిన అభ్యర్థికి మీ ఓటు పడిందా పడలేదా అనేది వివి ప్యాట్ ల ద్వారా వెంటనే తెలుసుకోవచ్చు అన్నారు. ఎన్నికల కమిషన్ సూచనల మేరకు తమ ఓటు హక్కును సద్వినియోగం (Exercising your right to vote as directed by the Election Commission) చేసుకోవాలని విద్యార్థులను కోరారు. 18 సంవత్సరంలు నిండి ఇంకా ఓటరుగా నమోదు చేసుకొని వారు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సూచించారు.
మెడికల్ విద్యార్థులందరూ బాగా చదువుకొని డాక్టర్లుగా, పిహెచ్డి, స్పెషలిస్ట్ డాక్టర్ గానే కాకుండా ఉన్నతాధికారు లుగా ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అదనపు కలెక్టర్, నకిరేకల్ నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి హేమంత్ కేశవ్ పాటిల్ మాట్లాడుతూ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్కరూ తమ ఓటును (Everyone casts their vote without giving in to any temptation) సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
నకిరేకల్ నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా బాధ్యత నిర్వహిస్తున్నందున ఈ నియోజకవర్గ పరిధిలోనే కామినేని మెడికల్ కళాశాల ఉన్నందున మీరంతా ఓటింగ్ లో పాల్గొనాలన్నారు. ఒకవేళ తమ ఓటు ఇతర నియోజకవర్గంలో ఉంటే ఇక్కడికి మార్చుకోవచ్చు అని సూచించారు. అనంతరం మెడికల్ విద్యార్థులతో జిల్లా కలెక్టర్ ఓటరు ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఓటింగ్ విధానం గురించి డాక్టర్ వర్షిత్, సిహెచ్ వైష్ణవి లు తమ అభప్రాయాలను వ్యక్తం చేశారు. డెమో ఈవీఎం మిషన్లు, వి వి ప్యాట్లు ఏర్పాటు చేసి విద్యార్థులకు అవగాహన కలిగించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎన్నికల నిర్వహణపై అధికారులు వివరించడం జరిగింది.
ఈ అవగాహన కార్యక్రమంలో ఎన్నికల నోడల్ అధికారి, జిల్లా పరిషత్ సీఈవో కరణ్ రెడ్డి, కామినేని మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శృతి మహంతి, తాసిల్దార్ పద్మ, తదితరులు పాల్గొన్నారు.