If only one day… that too can be given: ఒక్కటంటే ఒక్క రోజే… అది కూడా ఇవ్వాళే
-- రూ. 2వేల నోట్ల మార్పిడికి నేడే తుది గడువని గుర్తుంచుకోండి -- మరింత గడువు పెరిగే అవకాశం ఉంటుందో లేదోనంటున్న నిపుణులు
ఒక్కటంటే ఒక్క రోజే… అది కూడా ఇవ్వాళే
— రూ. 2వేల నోట్ల మార్పిడికి నేడే తుది గడువని గుర్తుంచుకోండి
— మరింత గడువు పెరిగే అవకాశం ఉంటుందో లేదోనంటున్న నిపుణులు
ప్రజా దీవెన/న్యూఢిల్లీ: దేశంలో రూ. 2నోటు చలామణి లో కనుమరుగు కాబోతోంది. ఒక్కప్పుడు రూ. వెయ్యి, ఆ తర్వాత ఇప్పుడు రూ. 2వేల నోటు పెద్ద నోట్ల రద్దు మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాక చకచకా జరిగిపోతున్నాయి. మొత్తానికి నోట్ల రద్దు పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
ఆయితే ప్రస్తుతం రూ. 2వేల నోట్ల మార్పిడికి చివరి గడువు కు సమయం ఆసన్నమైంది. అందుకు విధించిన గడువు ఒక్కరోజంటే ఒక్క రోజే మిగిలి ఉందని తెలుసుకోండి. నోట్లను డిపాజిట్, మార్పిడి చేసుకోవడానికి ఇవ్వాళ ఒక్క రోజు గడువు ( Only one day to deposit and exchange notes) మాత్రమే ఉంది.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ మే 19న రూ. 2వేల నోటును ఉపసంహరించుకోవాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రజలకు దానిని మార్చుకోవడం, బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవడం కోసం సెప్టెంబర్ 30వ తేదీ వరకు ( Till 30th September for making deposits in banks) సమయం ఇచ్చిన విషయo కూడా విదితమే.
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం సుమారు రూ. 24వేల కోట్ల విలువైన నోట్లు చెలామణిలో ఉండగా రూ. 2వేల నోట్లలో దాదాపు 93% బ్యాంకుల్లో డిపాజిట్ (Rs. About 93% of the 2000 notes are deposited in banks) చేయబడడం, మార్చుకోవడం జరిగిందని ఈ నెల ప్రారంభంలో ఆర్బీఐ వెల్లడించింది కూడా.
బ్యాంకుల నుండి అందిన డేటా ప్రకారం ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీ వరకు చలామణి నుండి ఉపసంహరించబడిన రూ. 2వేల బ్యాంకు నోట్ల మొత్తం విలువ రూ. 3.32 లక్షల కోట్లని భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఈ నెల సెప్టెంబర్ 1వ తేదీన ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ క్రమంలో రూ.2వేల వ్యాపారం ముగిసే వరకు రూ. 3.32 లక్షల కోట్ల చలామణిలో ఉoడగా ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీ నాటికి రూ. 2వేల బ్యాంకు నోట్ల విలువ రూ. 24,000 కోట్లని, మే 19వ తేదీ వరకు చెలామణిలో ఉన్న రూ. 2వేల బ్యాంకు నోట్లలో 93శాతం తిరిగి వచ్చాయని వెల్లడించారు.
ఆయితే సెప్టెంబరు 30వ తేదీ తర్వాత కూడా నోట్లు చట్టబద్ధంగా ఉంటాయని కాని అవి లావాదేవీల ప్రయోజనాల కోసం అంగీకరించబడవని స్పష్టం చేయడం జరిగిందని, ఇక పై భారతీయ రిజర్వ్ బ్యాంక్ లో మాత్రమే మార్పిడి చేసుకోవచ్చనేది ( Henceforth exchange can be done only at the Reserve Bank of India) సుస్పష్టం.
రూ. 2వేల నోట్లను మార్చుకునే సదుపాయం సెప్టెంబర్ 30వ తేదీ వరకు జారీ చేసే విభాగాలను కలిగి ఉన్న భారతీయ రిజర్వ్ బ్యాంక్ 19 ప్రాంతీయ కార్యాలయాల్లో మాత్రమే సేవలు( Services only in 19 regional offices of Reserve Bank of India) అందుబాటులో ఉంటాయని తెలియజేస్తుంది.
గడువు ముగుస్తున్న కూడా మార్పిడి చేసుకోని ప్రజలు తమకు అందుబాటులో ఉన్న ఈ 19భారతీయ రిజర్వ్ బ్యాంక్ బ్రాంచ్‌లలో మాత్రమే రూ. 2వేల నోట్లను మార్చుకోవచ్చని పేర్కొంది. ఈ క్రమంలో స్వల్ప మొత్తంగా మాత్రమే నోట్లు మార్కెట్ లో ఉండే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటుoడగా గడువు పెంపుపై చివరి రోజైన నేడు ఆర్బీఐ నుంచి ఏమైనా స్పష్టత వస్తుందా అనేది వేచి చూడాలి.