Ramagundam…dedicated to the nation: రామగుండం…జాతికి అంకితం
-- అందుబాటులోకి 800 మెగావాట్ల విద్యుత్తు -- ఆరంభానికి సిద్దంగా వాణిజ్య ఆపరేషన్ -- అక్టోబర్ 3వ తేదీన ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం
రామగుండం…జాతికి అంకితం
— అందుబాటులోకి 800 మెగావాట్ల విద్యుత్తు
— ఆరంభానికి సిద్దంగా వాణిజ్య ఆపరేషన్
— అక్టోబర్ 3వ తేదీన ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం
ప్రజా దీవెన/రామగుండం: రామగుండం ఎన్టిపిసి సారథ్యంలో నిర్మించిన తెలంగాణ సూపర్ థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులో మొదటి దశలో చేపట్టిన 800 మెగావాట్ల విద్యుత్తు త్వరలో అందుబాటులోకి రానున్నది. ఇందుకు సంబంధించి ఎన్టీపీసీ డిక్లరేషన్ ఆఫ్ కమర్షియల్ (సీఓడీ) ప్రకటించింది.
వచ్చేనెల 3వ తేదీన నిజామాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా టి ఎస్ టి పి ని ఆరంభించి జాతికి అంకితం చేయనున్నారని ఆయా వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే 800 మెగావాట్ల విద్యుత్తులో 85% రాష్ట్ర అవసరాల కోసమే వినియోగించనుoడగా మిగతా పదిహేను శాతం విద్యుత్తును ఇతర రాష్ట్రాలకు వాణిజ్య పరంగా సరఫరా చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ సరఫరా కోసం అప్పటి కేంద్ర ప్రభుత్వం పునర్విభజన చట్టంలో భాగంగా రామగుండం ఎన్టిపిసి ఆధ్వర్యంలో 2400 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు నెలకొల్పాలని పేర్కొoది.