Allu Arjun: టాలీవుడ్ ఇండస్ట్రీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్. అల్లు అర్జున్ పాపులారిటీ కేవలం సౌత్ ఇండస్ట్రీకి కాకుండా ఇండియా వైడ్ అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 (pushpa2 )ది రూల్ సినిమాలో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమా అనంతరం బన్నీ ఎవరితో తదుపరి సినిమా చేయబోతున్నాడని ప్రేక్షకులలో మరింత ఆసక్తి పెరిగిపోయింది.
ఇక ఈ పుష్ప 2 సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలన్నీ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇది ఇలా ఉండగా మరోవైపు దాదాపు 14 సంవత్సరాల తర్వాత ఆదర్శకుడతో మళ్లీ అల్లు అర్జున్ (Allu Arjun) కలిసి పని చేయబోతున్నట్లు సమాచారం. ఆ దర్శకుడు ఎవరో అని అనుకుంటున్నారా ..? ఆ దర్శకుడు ఎవరో కాదు వేదం సినిమా డైరెక్టర్ క్రిష్. అయితే ప్రస్తుతం సినిమా కోసం కాదు అట ఒక యాడ్ కోసం బన్నీ క్రిష్ కలిసి పనిచేయబోతున్నట్లు సమాచారం. అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios)లో అల్లు అర్జున్ ఒక పెద్ద బ్రాండ్ కు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ ను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఒక బ్రాండ్ ను ప్రమోట్ చేయడానికి కోసం క్రిష్ అల్లు అర్జున్ చేతులు కలిపారని సమాచారం.
అయితే అల్లు అర్జున్ ఏ బ్రాండ్ షూటింగ్ కి ఓకే చేశారని అలాగే ఈ బ్యాండ్ ప్రమోషన్ ఎప్పటి నుంచి మొదలు అవుతుందన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. ఇక బన్నీ ప్రస్తుతం నటిస్తున్న పుష్ప 2 (puashpa 2) సినిమాలో అల్లు అర్జున్ తో పాటు రరష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ (Rashmika Mandanna, Fahad Faasil)లాంటి పలువురు నటీనటులు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక అల్లు అర్జున్ ఈ సినిమాలో బాక్స్ ఆఫీస్ సెట్ చేయడం ఖాయం అంటూ బన్నీ ఫ్యాన్స్ తెలుపుతున్నారు. చూడాలి మరి బన్నీకి సక్సెస్ గా నిలుస్తుందో లేదో.