Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Allu Arjun: పుష్ప పునరుద్ఘాటన, బాధితురాలి కుటుంబానికి బాసటగా నిలుస్తా

ప్రజా దీవెన, హైదరాబాద్: పుష్ప ప్రీమియర్ షో సందర్భంగా హైదరా బాద్ సంధ్య థియేటర్ తొక్కిసలా ట ఘటనలో శుక్రవారం మధ్యా హ్నం అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం విధితమే. హైకోర్టు బెయి ల్ మంజూరు చేసినప్పటికీ ఈ కేసు లో రాత్రంతా జైలులోనే ఉన్న బన్నీ శనివారం ఉదయం విడుదల య్యారు. అనంతరం తన తండ్రి అల్లు అరవింద్ తో కలిసి నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లా రు. కాసేపటి క్రితమే ఇంటికి చేరుకు న్నారు.హైదరాబాద్ చంచల్ గూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జు న్ నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయా నికి చేరుకోగా అక్కడ పలువురు సినీ ప్రముఖులను కలుసుకున్నా రు. అనంతరం తన నివాసానికి చేరుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు.

అల్లు అర్జున్. ‘నేను బాగానే ఉన్నాను, ఆందోళన చెం దకండి. నేను చట్టాన్ని గౌరవిస్తాను. నిపోయిన మహిళ కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలియజేస్తు న్నాను. సినిమా చూసేందుకు వెళ్లి నప్పుడు అనుకోకుండా ఆ ఘటన జరిగింది. అలా జరగడం దురదృష్ట కరం. ఆ కుటుంబానికి నేనెప్పుడు అండగా ఉంటాను, బాసటగా నిలు స్తానని హామీ ఇచ్చారు.గత 20 ఏళ్లుగా ఆ థియేటర్‏కు వెళ్లి నా సినిమా చూస్తుంటాను, నా సిని మాలే కాదు మావయ్య సినిమాలు చూశాను, బాధిత కుటుంబానికి జరిగిన నష్టం పూడ్చలేనిది. అభి మానం, ప్రేమతో నాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవా దాలని అన్నారు.

శనివారం ఉద యం చంచల్ గూడా జైలు నుంచి విడుదలైన వెంటనే గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు అల్లు అర్జున్. అక్కడ న్యాయ వాదుల బృందం ఆయనతో చర్చలు జరిపింది. దాదాపు 45 నిమిషాలపాటు న్యాయవాది నిరంజన్ రెడ్డితో బన్నీ చర్చించారు. అలాగే తనను కలవడానికి వచ్చిన సినీ ప్రముఖులతో మాట్లాడారు. ఆ తర్వాత గీతా ఆర్ట్స్ నుంచి తన ఇంటికి చేరుకున్నారు.

మరోవైపు బన్నీ విడుదల ఆలస్యంపై అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కీలకవ్యాఖ్యలు చేశారు. హైకోర్టు బన్నీని వెంటనే విడుదల చేయా లని ఆదేశించిందని, అయినా సరే ఉద్దేశపూర్వకంగానే జైలులో ఉం చారని అన్నారు. ఈ విషయమై చట్టపరంగా ముందుకు వెళ్తామని, మరోసారి హైకోర్టును ఆశ్రయిస్తా మని అన్నారు. బెయిల్ వచ్చినా విడుదల ఆలస్యం చేయడంపై పోలీసులపై కోర్టు ధిక్కరణ కేసు వేస్తామని బన్నీ తరపు లాయర్ వ్యాఖ్యానించారు.