Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

ANR: వారికీ ఏఎన్నార్‌ పెట్టే కండీషన్‌ చుస్తే షాక్ అవ్వాల్సిందే..?

ANR: అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao)తెలుగు ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సీనియర్ ఎన్టీఆర్ కి దీటుగా సినిమాలు చేసి అందరికి అక్కటుకున్నారు . తన ఇమేజ్‌తో పనిలేకుండా పాత్ర నచ్చితే ఏ హీరోతోనైనా సినిమాలు చేసేవారు. అయితే తన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవాడట ఏఎన్నార్‌.

ఇక అక్కినేనికి (Akkineni Nageswara Rao)అందంపై దృష్టి ఎక్కువ అట. తన గ్లామర్‌ ఏమాత్రం తగ్గకుండా మైంటైన్ చేసేవారట. అంతేకాదు తనతో కలిసి నటించే లేడీ ఆర్టిస్టుల విషయంలోనూ అదే ఫాలో అయేవారట. అయితే అందంగా ఎవరైనా క్యారెక్టర్‌ ఆర్టిస్టులు ఉన్నారంటే ఓ రూల్‌ పెట్టేవాడట. ఆ కండీషన్‌ని అందరు కూడా కచ్చితంగా ఫాలో కావాల్సిందే. మరి ఏఎన్నార్‌ పెట్టిన కండీషన్‌ ఏంటి? అందమైన క్యారెక్టర్‌ ఆర్టిస్టు ల విషయంలో ఆయన చేసే పనేంటి అన్న విషయానికి వస్తే .. తల్లి (mother)పాత్రలకు, అత్త పాత్రలకు అందమైన క్యారెక్టర్‌ ఆర్టిస్టులను పెట్టనిచ్చేవాడు కాదట ఏఎన్నారు. తనకు తెలియకుండా పెట్టినా వెంటనే తొలగించేమనేవాడట. క్యారెక్టర్‌ ఆర్టిస్టులు అందంగా ఉంటే మరదలుగానో, వదినగానో, అక్కగానో, చెల్లి పాత్రలకు మాత్రమే పర్మిషన్ ఇచ్చేవారట.

అమ్మగా అందమైన ఆర్టిస్టులు చేస్తే తనని డామినేట్‌ చేస్తారనో, తాను వాళ్ల ముందు తగ్గిపోతాననో తెలియదు కానీ అమ్మ పాత్రలను చేయనిచ్చేవారు కాదని సీనియర్‌ నటి అన్నపూర్ణమ్మ (Annapurnamma) తెలిపింది. ఇలాంటి విషయాల్లో ఏఎన్నార్‌ చాలా స్టిక్ట్ గా ఉండేవాడని, వామ్మో ఆయన లెక్క వేరే అని తెపింది అన్నపూర్ణమ్మ. ఆమె ఈ విషయాన్నీ ఓపెన్‌ హార్ట్ విత్ ఆర్కే షోలో తెలిపింది. ఏఎన్నార్‌పై అందం మీద ఫోకస్‌ ఎక్కువ అని, అదే ఎన్టీఆర్‌ అవన్నీ పట్టించుకోడని, ఎవరు ఏ పాత్ర చేసినా ఆయనకు ఫర్వాలేదని, ఎందుకంటే ఆయన వెండితెరపై మ్యాజిక్‌ చేస్తారని కాబట్టి మిగిలిన పాత్రలు ఎవరు చేసినా పెద్దగా సమస్య ఉండదని, అదే ఏఎన్నార్‌ విషయంలో అలా ఉండదని, కచ్చితంగా ఈవన్నీ చూసుకుంటాడని అన్నపూర్ణమ్మ (Annapurnamma)తెలిపారు.

అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) తన ఏడు దశాబ్దాల సినీ జీవితంలో 255కిపైగా సినిమాలలో నటించారు. ఇందులో అన్ని రకాల సినిమాలున్నాయి. పౌరాణికాలు, జనపదాలు, సాంఘీకాలు, హిస్టారిక్‌ మూవీస్‌, ప్రేమ కథలు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్, యాక్షన్‌ సినిమాలు సైతం ఉన్నాయి. తెలుగుతోపాటు తమిళం, హిందీలోనూ సినిమాలు చేయడం విశేషం. హీరోగానే కాదు నిర్మాతగానూ మంచి పేరును సొంతం చేసుకున్నారు. ఏఎన్నార్‌ (anr)కాన్సర్‌తో 2013లో మృతి చెందిన సంగతి అందరికి తెలిసిందే. ఆయన చివరగా `మనం` సినిమాలో నటించారు. అలాగే ఈ సినిమాలో అక్కినేని ఫ్యామిలీ హీరోలంతా కలిసి నటించడం విశేషం.