Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BB8 : దమ్ము కొడుతూ దొరికిపోయిన లేడి కాంటస్టెంట్ ..?

BB8: బుల్లి తెర పై బిగ్ బాస్ 8 ఎంతో ఆసక్తికంరంగా కొనసాగుతున్న సంగతి అందరికి విదితమే .. ఎప్పటిలాగా హౌస్ లోకి కంటెస్టెంట్లుగా వచ్చిన ముమైత్ ఖాన్, సరయు, తేజస్వి మదివాడ, హమీదా (Mumait Khan, Sarayu, Tejaswi Madiwada, Hamida) స్మోకింగ్ చేస్తూ దొరికిపోయిన సందర్భాలు ఎక్కువ .. ఇక బిగ్ బాస్ 8 సీజన్లో కూడా పృథ్వి , నిఖిల్ దమ్ము కొడుతూ కనిపించిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ముఖ్యంగా నాలుగు వారాలుగా హౌస్ చీఫ్ గా ఉన్న నిఖిల్ ఒత్తిడి తట్టుకోలేక ప్యాకెట్ల మీద ప్యాకేట్లు సిగరెట్లు కాల్చడం మనం చూసాం. ఈ వ్యసనం నుంచి బయట పడేందుకు సోనియా గట్టి ప్రయత్నాలు కూడా చేసింది. అందులో భాగంగానే స్మోకింగ్ మానేస్తే ఏది అడిగినా ఇస్తానని బంపర్ ఆఫర్ కూడా ఇచ్చింది.. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.. ఇక దీని గురించి స్పందించిన సోనియా.. నిఖిల్ సిగరెట్ తాగడానికి మాత్రమే చూపించారు. కానీ., బిగ్ బాస్ హౌస్ లో చాలా మంది స్మోకింగ్ చేస్తారని.. అమ్మాయిలు కూడా స్మోకింగ్ చేస్తారు కానీ వాళ్లను మాత్రం చూపించట్లేదని తెలిపింది. ఒక లేడీ హౌస్ మెట్ అయితే ఒత్తిడి తట్టుకోలేక సిగరెట్ తాగుతూ ఉంటే.. నేనే మంచిది కాదని చెప్పి మరి ఆపేశాను. కానీ., ఆ లేడీ కంటెస్టెంట్ పేరు మాత్రం నేను బయటకు చెప్పను అంటూ సోనియా తెలియా చేసింది..

అయితే., ఇలా సోనియా మాటలు బిగ్ బాస్(bigg boss) ఆడియన్స్ ఓ పెద్ద చర్చ కొనసాగిస్తున్నారు . బిగ్బాస్ హౌస్ (bigg boss)లో దమ్ము కొట్టే లేడి కంటెస్టెంట్ ఎవరా అని తీవ్ర చర్చలు కొనసాగిస్తూ ఉన్నారు. ఇంతలోనే బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న విష్ణు ప్రియ (Vishnu priya) సిగరెట్ తాగిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .. ఇందులో బిగ్ బాస్ హౌస్ లో ఒక కార్నర్ లో బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ లో ఉన్న విష్ణు ప్రియ స్మోకింగ్ ఏరియాలో కూర్చొని దమ్ము కొడుతూ ఉన్నట్లు మనం చూడవచ్చు. అయితే., ఆమె విష్ణుప్రియ కాదని చాలా మంది అభిప్రాయం.. కొంతమంది విష్ణు ప్రియ ఫ్యాన్స్ అమ్మాయిలు సిగరెట్ తాగితే తప్పేంటి అని ప్రశ్నిస్తున్నారు. ఇది ఇలా ఉండగా మరోవైపు శేఖర్ భాషా సైతం విష్ణు ప్రియకు సిగరెట్ తాగే అలవాటు ఉందని ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. చూడాలి మరి అది ఎవరా అనేది.