Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BIGG BOSS 8: బిగ్ బాస్ సీజన్ 8లో నందమూరి హీరో..?

BIGG BOSS 8:అతి త్వరలోనే స్టార్ మాలో బిగ్ బాస్ సీజన్ 8 (BIGG BOSS8)మొదలు అవ్వబోతుంది. బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది అంటే ప్రేక్షకుల్లో ఆసక్తి బాగా పెరిగింది. ఇప్పటికే బిగ్ బాస్ (BIGG BOSS) సీజన్ 7 సూపర్ సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు సీజన్ 8 కోసం చాల ఆతృతగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. అయితే ఈ సీజన్ కు కూడా మరోసారి నాగార్జున హోస్ట్ గా ఉండబోతున్నారు. ఇక బాగ్ బాస్ 8 కి సంబంధించి రెండు ప్రోమోలు విడుదల చేశారు టీం. అయితే బిగ్ బాస్ సీజన్ 8 (BIGG BOSS8) హౌస్‌లోకి ఎవరు వెళ్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బిగ్ బాస్ 8లోకి ఈసారి చాలా మంది పాల్గొంటారని అంచనా. గత బిగ్ బాస్ సీజన్(BIGG BOSS) 7లో రైతు బిడ్డగా వచ్చిన పల్లవి ప్రశాంత్ ఎవరు ఊహించని విధంగా విన్నర్ గా నిలిచి అందరికి అక్కటు కున్నాడు. దాంతో ఈసారి హౌస్ లోకి ఎవరు వెళ్తారు. సామాన్యులు ఎవరు వెళ్తున్నారు. సెలబ్రెటీలు ఎవరు వస్తున్నారు అన్న విషయం ఆసక్తికరంగా మారింది అనే చెప్పాలి.

మరో వైపు ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా మంది పేర్లు వైరల్ గా చెక్కారు కొడుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో (social media) చక్కర్లు కొడుతోన్న పేర్లు విషయానికి వస్తే .. వేణుస్వామి, రీతూ చౌదరి, సీరియల్ ఆర్టిస్టులు అంజలి, యశ్మీ గౌడ, తేజశ్వీ గౌడ, సీనియర్ నటి సనా, కమెడియన్ బంచిక్ బబ్లూ, కిరాక్ ఆర్పీ, రింగ్ రియాజ్, పాగల్ పవిత్ర ఇలా చాలామంది పేర్లు ఉన్నాయి. వీరిలో చాలా మంది దాదాపు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నారని కూడా అంచనా. అయితే తాజాగా మరో పేరు కూడా సోషల్ మీడియాలో (social media) టాక్ వినిపిస్తుంది.

హౌస్ లో నందమూరి ఫ్యామిలీ (Nandamuri Family) నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన హీరో చైతన్య కృష్ణ. నందమూరి చైతన్య కృష్ణ (Chaitanya Krishna) చాలా మందికి సుపరిచితుడే.. చేసింది తక్కువ సినిమాలే అయిన మంచి గుర్తింపు కూడా ఉంది. చైతన్య 2003లో జగపతి బాబు హీరోగా వచ్చిన ‘ధమ్’లో ఓ పాత్రలో కూడా కనిపించాడు. అనంతరం సినిమాలకు దూరంగా ఉన్నాడు. చాలా రోజుల తర్వాత మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవల బ్రీత్ అనే సినిమా చేశాడు. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచి అందరిని అక్కటుకోలేక పోయాడు. ఈ మధ్యలో పాలిటిక్స్ లో కూడా కనిపించాడు ఈ హీరో. అయితే ఈ నందమూరి హీరో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ కూడా ఇస్తునట్టు వార్తలు కూడా వస్తాయి. ఇక బిగ్ బాస్ హౌస్‌లోకి చైతన్య కృష్ణ (Chaitanya Krishna)ఎంట్రీ ఇస్తున్నారన్నదని పై ఎలాంటి క్లారిటీ మాత్రం లేదు. బిగ్ బాస్ సీజన్ 8 (Bigg Boss Season 8) సెప్టెంబర్ 8 ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభం అవుతుందని టాక్ వినపడుతుంది.