BIGG BOSS8: ప్రస్తుతం బుల్లి తేర పై బిగ్‌బాస్ సీజన్ 8 (BIGG BOSS8)మూడో వారం ఎలిమినేషన్ జారబోతుంది. మరికొన్ని గంటల్లో ఎవరు బయటకు వెళ్లనున్నారనే విషయంపై ఒక క్లారిటీ కూడా వస్తుంది. మరోవైపు రెండు రోజులుగా సాగిన ప్రభావతి 2.0 టాస్కు ఎట్టకేలకు ముగింపుకు వచ్చింది. ఇందులో భాగంగా చివరకు హౌస్ చీఫ్ గా నిఖిల్ మరోసారి గెలిచాడు. ఈసారి మొత్తం 14 మంది కంటెస్టెంట్లతో ఈ షో ప్రారంభంకాగా.. ఇప్పటివరకు ఇద్దరు ఎలిమినేట్ అయ్యిన సంగతి అందరికి తెలిసిందే. మొదటి వారం బెజవాడ బేబక్క బయటకు రాగా.. రెండో వారం ఎవరు ఊహించని విధంగా శేఖర్ భాషా ఎలిమినేట్ అయ్యాడు. అయితే ఈ వారంలో డేంజర్ జోన్ లో పృథ్వీ, అభయ్ చిట్ట చివరి స్థానాల్లో ఉన్నట్లు తెలుస్తుంది. కానీ సోషల్ మీడియా నివేదికల ప్రకారం మూడో వారం అభయ్ ఎలిమినేట్ అవుతాడు అనే వార్త వైరల్ గా (viral) చెక్కర్లు కొడుతుంది.
అయితే తాజాగా బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్స్ (Bigg Boss Contestants Remunerations) గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర చర్చ మొదలు అయింది . అది ఏమినాటంటే ఈ సీజన్‌లో అత్యధిక పారితోషికం పొందిన కంటెస్టెంట్ నటుడు ఆదిత్య ఓం అని నివేదికలు తెలుపుతున్న . కానీ అతడి కంటే ఎక్కువగా యాంకర్ విష్ణుప్రియ పారితోషికం ఉందని అంచనా. అవును బిగ్‌బాస్ 8 తెలుగు షోలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కంటెస్టెంట్ విష్ణుప్రియ. ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం ఆమెకు వారానికి రూ.5.5 లక్షలు అని.. అదనంగా 18% GSTతో కలిసి మొత్తం రూ.6.49 లక్షలు అంటున్నారు. అదిత్య ఓంకు ఎక్కువగానే చెల్లించినప్పటికీ వారానికి రూ.5 లక్షలు ఇస్తున్నారని టాక్ .విష్ణుప్రియ (Vishnu Priya).. బిగ్‌బాస్ రియాల్టీ షో కంటే ముందే తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన యాంకర్. అలాగే అచ్చ తెలుగమ్మాయి. ఇక సోషల్ మీడియాలో కూడా విష్ణుప్రియకు మంచి ఫాలోయింగ్ ఉంది. మొత్తానికి ఈ సీజన్ లో అత్యంత డిమాండ్ ఉన్న కంటెస్టెంట్ విష్ణుప్రియ.. ఇప్పటివరకు కూడా విష్ణుకు సపోర్ట్ పెరుగుతూనే ఉంది. దీంతో ఆమె టాప్ 5లో ఉండడం పక్కా అని ఆమె అభిమానులు అంటున్నారు. విష్ణుప్రియ (Vishnu Priya) భీమినేని పాపులర్ షో పోవే పోరాకు హోస్ట్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆమె 2005లో మయూఖం సినిమాతో మలయాళ చిత్ర పరిశ్రమలో తొలిసారిగా నటించింది. పవన్ సాదినేని దర్శకత్వం వహించిన ప్రముఖ టీవీ షో దయాలో కూడా విష్ణుప్రియ అందరికి కనపడింది.